JanaSena Madepalli Srinivas: కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నేత హత్యాయత్నం కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. నలుగురు యువకులు కత్తితో దాడికి ప్రయత్నించారని పోలీసులకు పిర్యాదు చేశారు జనసేన నేత మాదెపల్లి శ్రీనివాస్. సిసిపుటేజ్ అధారంగా యువకులను గుర్తించిన పోలీసులు ఘటనపై విచారించారు. అయితే, ఆ నలుగురు యువకులు దాడికి ప్రయత్నించలేదని ఏ తప్పు చేయలేదని వదిలిపెట్టారు. ఆ యువకులు స్ధానిక ఇందిరానగర్ కు చెందిన వారిగా గుర్తించారు. పెయింటింగ్ పనులు, చెట్లు నరికే పనులు చేస్తూ బ్రతుకుతున్నట్లు తెలిపారు.
Also Read: మేకపాటికి చేదు అనుభవం.. రసభసగా గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం..!
నిన్న పనిలోకి వెళ్ళి వస్తుండగా జనసేన కార్యాలయం సమీపంలో జనసేన నాయకులు వారిని అపి.. ఓటు ఏ పార్టీకి వేస్తారని అడిగారన్నారు. అదే సమయంలో తమ వద్ద ఉన్నా పని సామాగ్రి ఉన్నాయని చెప్పారు. అంతే తప్ప జనసేన నేతపై దాడి చేయలేదని వెల్లడించారు. దీంతో, జనసేన పార్టీ నాయకులపై యువకుల తల్లి దండ్రులు, దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేయని తప్పుకు ఫిర్యాదు చేసి వారిని నిందితులుగా ప్రచారం చేస్తారా? అని ధ్వజమెత్తారు.
Also Read: కడప జిల్లాలో వైసీపీ ఎంపీటీసీ భర్త దౌర్జన్యం.. టోల్‍గేట్ సిబ్బందిపై దాడి..!
మాలమహానాడు జాతీయ అద్యక్షుడు పండు అశోక్ కుమార్, యువకుల కుటుంబ సభ్యులతో పోలీస్ స్టేషన వద్ద మోహరించారు. రాజకీయ లబ్ధి కోసం దళిత యువకులను బలి చేసేందుకు జనసేన నాయకులు చూస్తున్నారని మండిపడ్డారు. దళితులను అక్రమ కేసులలో ఇరికించే ప్రయత్నాలు మానుకోకపోతే జనసేన కార్యాలయం ముందు ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావతం అయితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.