చేతులెత్తి మొక్కుతున్నా...ఒక్కసారి గెలిపించండి ప్లీజ్..!! జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకున్న కెపాసిటితో ఏదోక పదవి పొందవచ్చంటూ వ్యాఖ్యలు చేవారు. సీఎం జగన్ లా..తాను అద్బుతాలు చేస్తానంటూ హామీ ఇవ్వనని..మీ విశ్వాసం సరైన వ్యక్తులపై పెట్టడం లేదంటూ పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. చేతులెత్తి మొక్కుతున్న..ఒక్కసారి గెలిపించండి...నేనెంటో నిరూపించుకుంటానంటూ వ్యాఖ్యనించారు. వారాహి యాత్రలో భాగంగా సోమవారం కాకినాడలో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. By Bhoomi 20 Jun 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ కాకినాడలో ప్రసంగించారు. తనకున్న కెపాసిటితో ఏదొక పదవి పొందవచ్చని...ఇన్ని మాటలు పడాల్సిన అవసరం తనకు లేదన్నారు. తనకు కావాల్సింది అధికారమే అనుకుంటే..ఇంత కష్టపడాల్సిన అవసరం ఎందుకుంటుందన్నారు. తాను ఎన్నో కమిట్ మెంట్స్ తో జనసేన పార్టీని పెట్టానని..ప్రస్తుత సీఎం జగన్ లాగా తాను అద్బుతాలు చేస్తానని మాయమాటలు చెప్పడంలేదని..మీ విశ్వాసం నాపై ఎందుకు పెట్టడం లేదంటూ పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నిల్లో జనసేనపార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ మీకు రెండు చేతులెత్తి నమస్కరిస్తూ అభ్యర్థిస్తున్నాన్నారు. తనకు ఎంపీలనిస్తే పనులు చేయిస్తాన్నారు. జనసేనకు ఓటు షేర్ ఉందని కాబట్టి ప్రధానిమంత్రి మోడీ పవన్ కల్యాణ్ ను పిలిచారంటూ తెలిపారు. ఇక సీఎం జగన్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు పవన్ కల్యాణ్. జగన్ కు మూడు కంపెనీలు ఉన్నాయని...వాటికి రూ. 10వేల కోట్లు పోతున్నాయని..తనకు ఎవరితోనూ కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేనాని. అంతకుముందు కాకినాడలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. తనకు కోన్ కిస్కాగాళ్లంటే అస్సలు భయం లేదన్నారు. 2019లో వైసీపీ అధికారింలోకి వచ్చినప్పుడు పీకలదాకా తాగి, మద్యం మత్తులో బండబూతులు తిట్టాడంటూ పవన్ ఆరోపించారు. కాకినాడ ఎమ్మెల్యేకు నోటిదూలతోపాటు ఒళ్లుతిమ్మిరికూడా చాలా ఎక్కువ ఉందంటూ పవన్ చురకలంటించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి