జమ్మూ కాశ్మీర్ స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ 2021 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున అరంగేట్రం చేశాడు. గంటకు 150 కి.మీ కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తూ అందరి దృష్టి ఆకర్షించాడు. 2022 జూన్‌లో ఇంటర్నేషనల్ టీ20ల్లో, ఆ తర్వాత వన్డేల్లో అరంగేట్రం చేసినా ఏడాది తర్వాత టీంలో ప్లేస్ దక్కలేదు.దీనిపై తాజాగా టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే స్పందించాడు.
ఉమ్రాన్ మాలిక్ వేగంతో బంతులు వేయగలడు. అయితే బౌలింగ్‌పై అతడికి నియంత్రణ లేదని, కెప్టెన్‌పై నమ్మకాన్ని కోల్పోయాడని పరాస్ మాంబ్రే చెప్పాడు. ఉమ్రాన్ మాలిక్ పతనం ఇండియన్ క్రికెట్‌లో అత్యంత నిరాశపరిచిన విషయమని తెలిపాడు.ఉమ్రాన్ మాలిక్ లైన్ అండ్ లెంగ్త్ ట్రాక్ తప్పడంతో క్రమంగా ఫామ్ కోల్పోయాడు. పేలవ ప్రదర్శనతో ఇండియా టీమ్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా దూరమయ్యాడు. అయితే ఉమ్రాన్ మాలిక్ లాంటి ప్లేయర్లను డెవలప్ చేయాలని పరాస్ మాంబ్రే పేర్కొన్నాడు.
తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ, ఎంత వేగంగా బంతులు వేసినా, బౌలింగ్‌పై నియంత్రణ ఉండాలని చెప్పాడు.ఉమ్రాన్ మాలిక్ మళ్లీ రంజీ ట్రోఫీలో ఆడాల్సిన అవసరం ఉందని, బౌలింగ్‌పై కంట్రోలింగ్ తిరిగి పొందడానికి ప్రయత్నించాలని పరాస్ మాంబ్రే సూచించాడు.