/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-15-at-3.55.03-PM.jpeg)
Jammu Kashmir Road Accident: జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దోడా (Doda) జిల్లాలో ఓ బస్సు అదుపు తప్పి దాదాపు 300 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన స్ధలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Many feared dead in Major road accident in Doda (JK) after bus carrying 40 passengers skidded off the road near Trungal - Assar and fell several metres downhill pic.twitter.com/4S6KXt31p9
— Weatherman Shubham (@shubhamtorres09) November 15, 2023
ప్రమాదానికి గురైన బస్సు 40 మంది ప్రయాణికులతో కిష్త్వార్ నుంచి జమ్మూ వైపు వెళ్తోంది. ఈ మార్గంలో ఓ బస్సును మరో బస్సు ఓవర్‌టేక్ చేసే క్రమంలో ట్రుంగల్-అస్సార్ (Trungal - Assar) సమీపంలో లోయలో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Also read: ఐదేళ్ల బాలికపై అఘాయిత్యం.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు
పోలీసులు, రెస్క్యూ బృందాలతో సహా స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య 20 కంటే ఎక్కువ ఉండొచ్చని దోడా పోలీసులు వెల్లడించారు. కాగా.. ఈ వారం దోడా జిల్లాలో జరిగిన రెండో ఘోర రోడ్డు ప్రమాదం ఇది.