Jammu Kashmir: ఐడియా అదిరింది.. బెయిల్ పై ఉన్న టెర్రరిస్ట్ లపై పోలీసుల హైటెక్ నిఘా 

బెయిల్ పై ఉన్న టెర్రరిస్ట్ ల కదలికలపై నిఘా ఉంచేందుకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు GPS అంకెలెట్‌లను ఉపయోగించడం ప్రారంభించారు. 

Jammu Kashmir: ఐడియా అదిరింది.. బెయిల్ పై ఉన్న టెర్రరిస్ట్ లపై పోలీసుల హైటెక్ నిఘా 
New Update

పోలీసులు తరుచుగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేస్తారు. వారిపై అభియోగాలు మోపి జైలుకు పంపిస్తారు. వారిలో కొందరికి తరువాత బెయిల్ లభిస్తుంది. బెయిల్ దొరికిన తరువాత వారు షరతులను పాటించకుండా ఉండడం.. ఒక్కోసారి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుపోవడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితి రాకుండా జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir)పోలీసులు ఒక బ్రిలియంట్ ఐడియా వేశారు. 

బెయిల్‌పై విడుదలైన ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న నిందితులను పర్యవేక్షించడానికి జమ్మూ కాశ్మీర్(Jammu Kashmir) పోలీసులు GPS అంకెలెట్‌లను ఉపయోగించడం ప్రారంభించారు. కశ్మీర్ (Jammu Kashmir)పోలీసులు దేశంలోనే ఈ విధంగా చేసిన తొలి పోలీసులుగా నిలిచారు.  హిజ్బుల్ ముజాహిదీన్‌తో సంబంధం ఉన్న వాడిగా ఆరోపణలు ఎదురుకుంటున్న గులాం మహ్మద్ భట్ GPS ట్రాకర్‌ను భారతదేశంలో మొదటిసారిగా ధరించిన నిందితుడు అయ్యాడు. 2007 టెర్రర్ ఫండింగ్ కేసులో గులాం నిందితుడు.

GPS యాంక్లెట్ వ్యవస్థ ఏమిటంటే, దానిని విడుదల చేయబోయే వ్యక్తి చీలమండపై ఒక తాళం లా ఏర్పరు చేస్తారు. దీనిద్వారా  పోలీసు కంట్రోల్ రూమ్(Jammu Kashmir) నుంచి నిందితుడి కదలికలను ట్రాక్ చేస్తారు.

ఈ యాంక్లెట్ వల్ల ప్రయోజనం ఏమిటి?

అమెరికా, యూకే, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా,  న్యూజిలాండ్ వంటి దేశాల్లో బెయిల్, పెరోల్ అలాగే గృహనిర్బంధంలో ఉన్న నిందితుల కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఈ రకమైన GPS యాంక్లెట్ వ్యవస్థ ఉపయోగిస్తారు. దీంతో జైళ్లలో రద్దీ తగ్గుతుంది.

Also Read: ఒక్క యాప్ డౌన్‌లోడ్  మీ ఎకౌంట్ ఖాళీ చేసేయవచ్చు.. ఎలా అంటే.. 

జీపీఎస్ ట్రాకర్ అమర్చిన గులాం భట్ ఎవరంటే.. 

ఎన్ఐఏ కోర్టు జమ్మూ ఆదేశాల మేరకు (Jammu Kashmir)పోలీసులు గులాం భట్‌కు జీపీఎస్ ట్రాకర్‌ను అమర్చారు. గులాం భట్ ఉదంపూర్‌లో పలు సెక్షన్ల కింద యూఏపీఏ కేసులో నిందితుడిగా ఉన్నారు. తన బెయిల్ కోసం పిటిషన్‌ వేశారు. 2.5 లక్షల టెర్రర్ ఫండింగ్ తీసుకెళ్తుండగా గులాం పట్టుబడ్డాడు.

గులాం హిజ్బుల్ ముజాహిదీన్‌తో సంబంధం కలిగి ఉన్నాడు. NIA, ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు కూడా ఉగ్రవాద కుట్ర ఆరోపణలపై అతనిని దోషిగా నిర్ధారించాయి. అతను 12 సంవత్సరాల జైలు శిక్షను అనుభవించాడు.

ఈ ఏడాది ఆగస్టు 24న హోం మంత్రిత్వ శాఖకు(Jammu Kashmir) చెందిన పార్లమెంటరీ కమిటీ జైలు సంస్కరణలపై నివేదికను సమర్పించింది. ఇందులో బెయిల్‌పై విడుదలైన ఖైదీలకు తక్కువ ఖర్చుతో కూడిన బ్రాస్‌లెట్ లేదా యాంక్‌లెట్ ట్రాకర్‌ను తయారు చేసే సాంకేతికతను అన్వేషించాలని సూచించారు.

కాశ్మీర్‌కు కొత్త డీజీపీ రష్మీ రంజన్ స్వైన్

ఇటీవలే, మూడు దశాబ్దాలుగా పోలీసు(Jammu Kashmir) శాఖలో సేవలందిస్తున్న ప్రస్తుత కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ అక్టోబర్‌లో పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి రష్మీ రంజన్ స్వైన్ నియమితులయ్యారు.అధికారిక సమాచారం ప్రకారం సెప్టెంబర్ 2018 నుంచి అక్టోబర్ 2023 వరకు డీజీపీ దిల్‌బాగ్ సింగ్ హయాంలో 950 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

Watch this interesting Video:

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe