/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/earth.jpg)
దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో వరుస భూకంపాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని దోడా, లడఖ్ ప్రాంతాల్లో రెండు సార్లు భూమి కంపించింది. శనివారం రాత్రి జమ్మూ కాశ్మీర్‌లోని దోడా, లడఖ్ ప్రాంతాల్లో వరుసగా భూకంపాలు సంభవించాయి. దీంతో ఇక్కడి నివాసితులు భయాందోళనలకు గురవుతున్నారు. శనివారం సాయంత్రం జమ్మూకశ్మీర్, లడఖ్‌లో భూకంపం సంభవించింది. తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది. దోడా జిల్లాలో పది నిమిషాల వ్యవధిలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదు అయినట్లు అధికారలు తెలిపారు.
ఇక నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం.. లడఖ్‌లో రాత్రి 9:44 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.5 గా నమోదైంది. అటు దోడాలో భూకంపం పది నిమిషాల తర్వాత రాత్రి 9:55 గంటలకు భూప్రకంపనలు వచ్చాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.4గా నమోదైంది. లడఖ్‌లో భూకంప కేంద్రం లేహ్‌కు 271 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో దోడాలో భూకంపం కేంద్రం భూమిలో 18 కి.మీ. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదు.
అంతకుముందు జమ్మూకశ్మీర్‌లోని కొండ ప్రాంతాలలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. ఐదు రోజుల్లో జమ్మూ కాశ్మీర్‌లో 6 సార్లు భూమి కంపించింది. భూకంపాల దృష్ట్యా జమ్మూ కాశ్మీర్ చాలా సున్నితంగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా దోడా, కిష్త్వార్, రాంబన్‌లలో వారంరోజుల నుండి ప్రకంపనలు సంభవిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3గా నమోదైంది. దాని కేంద్రం రాంబన్‌లో భూమికి ఐదు కిలోమీటర్ల దిగువన ఉన్నట్లు గుర్తించారు. నిరంతరాయంగా ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున రాంబన్, కాశ్మీర్ లోయలోని పలు ప్రాంతాలకు ఆనుకుని ఉన్న దోడా జిల్లాలో భూప్రకంపనల వల్ల పలు ఇళ్లు ద్వంసం అయ్యాయి.