GAVASKAR: యశస్వి జైస్వాల్ ను మందలించిన గవాస్కర్!

ఇంగ్లాడ్ సిరీస్ కు ముందు యశస్వి జైస్వాల్ ను తాను స్వల్పంగా మందలించానని మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు.

New Update
GAVASKAR: యశస్వి జైస్వాల్ ను మందలించిన గవాస్కర్!

ఇంగ్లాడ్ సిరీస్ కు ముందు యశస్వి జైస్వాల్ ను తాను స్వల్పంగా మందలించానని మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు.

భారత్ వేదిక గా ఇంగ్లాడ్ తో జరిగిన 5 మ్యాచ్ ల టెస్ట్  సిరీస్ లో   4-1 తో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. ఈ సీరిస్ లో యువఆటగాడు యశస్వి ఐదు మ్యాచ్ ల్లో 712 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాడ్ ఆటగాళ్లకు తనదైన శైలీలో బజ్ బాల్ క్రికెట్ ను చూపిస్తూనే సాంప్రదాయ షార్ట్ లతో అలరించాడు. దక్షిణాఫ్రికాతో జరగనున్న సిరీస్ కు యువ ఓపెనర్లలో ఎంపికల విషయం పై  హిందుస్థాన్ ఛానల్ తో పంచుకున్నారు.

యశస్వి జైస్వాల్  వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్ట్ సిరీస్ లో అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన జైశ్వాల్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా విఫలమైయాడు. దీంతో ఆ సిరీస్ లో జైస్వాల్ ను స్వల్పంగా మందలించానని గవాస్కర్ వెల్లడించారు. అనవసరంగా వికెట్ ను బౌలర్ కు ఇవ్వద్దని తనకు సూచించానని అన్నారు. నేను అతనికి అక్కడ చెప్పినదాన్ని మరచిపోయాడు." కానీ హే, మీరు మీ ఇరవైలలో ఉన్నప్పుడు ఎవరి మాట వింటారు? అన్నట్టు ఇంగ్లాడ్ పై ఆడాడని గవాస్కర్ అన్నారు. కాని జైస్వాల్ తన మాటలను  ఎప్పటికీ మరచిపోలేడని నేను ఆశిస్తున్నా అని సన్నీ తెలిపారు.  ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తన ప్రదర్శనతో జైస్వాల్ నిజంగా అంతర్జాతీయ వేదికపైకి వచ్చాడని గవస్కార్ అన్నారు. యువ ఓపెనర్ తాను ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌లలో   రెండు డబుల్ సెంచరీలు పూర్తి చేసి 712 పరుగులు సాధించాడని కొనియాడారు..జైస్వాల్ తన కెరీర్‌లో మరిన్ని విజయాలు సాధించాలని గవాస్కర్ ఆకాంక్షించారు. జైస్వాల్ ప్రస్తుతం గవాస్కర్ ఘనతను సమం చేసి ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లో 700కి పైగా పరుగులు చేసిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో  8వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. భారత ఓపెనర్ ఫిబ్రవరిలో ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును కూడా జైస్వాల్ గెలుచుకున్నాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు