Jagan: రక్షణ కల్పించండి.. మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన ట్వీట్..!

ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయన్నారు జగన్. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Jagan: రక్షణ కల్పించండి.. మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన ట్వీట్..!
New Update

Jagan: అధికారం కోల్పోయాక మాజీ ముఖ్యమంత్రి జగన్ తొలిసారి సోషల్ మీడియాలో స్పందించారు. 'రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది.

Also Read: ఏపీ ప్రభుత్వ కార్యాలయాలపై స్పెషల్ ఫొకస్ .. సిట్‌ ఆఫీసుకు సీల్‌..!

అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గౌరవ గవర్నర్‌ గారు వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం' అని ట్వీట్ లో పేర్కొన్నారు.

#jagan-mohan-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe