/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/jagan-7.jpg)
Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్...తాడేపల్లిలోని నివాసంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులను కలిశారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసానిచ్చారు.