Breaking: విధుల్లో చేరాలి..అంగన్వాడిలకు జగన్ అల్టిమేటం..లేదంటే..?

అంగన్ వాడిలకు ఏపీ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఈ నెల 5లోగా విధుల్లో చేరాలని ఆదేశాలు ఇచ్చింది. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. అంగన్వాడీల సమ్మె కారణంగా బాలింతలు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది.

Breaking: విధుల్లో చేరాలి..అంగన్వాడిలకు జగన్ అల్టిమేటం..లేదంటే..?
New Update

Breaking: అంగన్ వాడిలకు ఏపీ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఈ నెల 5 లోగా విధుల్లో చేరాలని ఆదేశాలు ఇచ్చింది. లేదంటే చర్యలు తప్పవని వైసీపీ ప్రభుత్వం హెచ్చరించింది. అంగన్వాడీల కారణంగా బాలింతలు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. అయితే, ప్రభుత్వం బెదిరించిన సమ్మె విషయంలో వెనక్కి తగ్గేదేలేదంటున్నారు అంగన్వాడీలు.

Also Read: కాళేశ్వరం అవినీతిపై ఏం చేస్తున్నారు? అవినీతిని కక్కించాల్సిందే అంటున్న కిషన్ రెడ్డి.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కనీసం రూ. 26 వేల వేతనంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడి కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేదే లేదని  స్పష్టం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా వినూత్న రీతిలో నిరసనలు చేపట్టారు అంగన్వాడి కార్యకర్తలు.



రాష్ట్రంలో జిల్లాల వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, వైసిపి ఇన్చార్జిల నివాసాలను కూడా ముట్టడించారు. అంగన్వాడి కార్యకర్తలు వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ, పింఛన్ అమలు డిమాండ్లను వెంటనే పరిష్కరించాల్సిందేనని పట్టుబట్టారు. తెలంగాణ రాష్ట్రం కంటే వెయ్యి రూపాయలు అదనంగా జీతం ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చిన జగన్ ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఆందోళన విరమించేందుకు ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలితం కనిపించలేదు.

తాజాగా, అంగన్వాడీలకు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఈ నెల 5 తేదీలోగా విధులకు హాజరు కావాలని స్పష్టం చేసింది ప్రభుత్వం. విధులరు హాజరు కాకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు ఇచ్చింది. ఏ జిల్లాలకు ఆ జిల్లా కలెక్టర్ల నుంచి అంగన్వాడీలకు నోటీసుల జారీ చేసింది. ప్రభుత్వ విఙప్తి పేరుతో నోటీసులు జారీ చేసింది సర్కారు. అంగన్వాడీల సమ్మె వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను నోటీసులో వివరించింది. అంగన్వాడీలకు ప్రభుత్వం చేసిన మేళ్లను కూడా నోటీస్ లో వివరించారు.

#andhra-pradesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe