అది కాంగ్రెస్ కాదు..’స్కామ్’ గ్రెస్ సెటైర్ వేసిన కేటీఆర్!

కాంగ్రెస్ ‘స్కామ్’ గ్రెస్ అయిపోయిందని.. ఇదే ఆ పార్టీ అసలైన రంగూ అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సెటైర్ వేశారు. కర్ణాటకలో కొలువుదీరిన కాంగ్రెస్ అక్కడ అసలు రంగును బయటపెడుతోందని ఆయన ఫైర్ అయ్యారు. కర్ణాటక విజయోత్సవంతో జోష్ లో ఉన్న టీ కాంగ్రెస్ నేతలు తెంగాణలోనూ అక్కడి ఫలితాలను రిపీట్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

New Update
అది కాంగ్రెస్ కాదు..’స్కామ్’ గ్రెస్ సెటైర్ వేసిన కేటీఆర్!

కాంగ్రెస్ ‘స్కామ్’ గ్రెస్ అయిపోయిందని.. ఇదే ఆ పార్టీ అసలైన రంగూ అంటు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సెటైర్ వేశారు. కర్ణాటకలో కొలువుదీరిన కాంగ్రెస్ అక్కడ అసలు రంగును బయటపెడుతోందని ఆయన ఫైర్ అయ్యారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ స్కామ్ గ్రెస్ గా మారిందని ఎద్దేవా చేశారు.

కాగా,కర్ణాటకలో గత బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్ సర్కార్ అంటూ ఎన్నికల నినాదంగా మార్చుకున్న కాంగ్రెస్ విజయం హస్తగతం చేసుకుంది. ఇక తాజాగా అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పై అదే తరహా ఆరోపణలు గుప్పమనడం.. రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. డిప్యూటీ సీఎం పరిధిలో ఉన్న శాఖలోనే పెద్ద ఎత్తున కరెప్షన్ జరుగుతోందని బృహత్ బెంగళూరు మహానగర పాలికే కాంట్రాక్టర్ల సంఘం గవర్నర్ కు ఫిర్యాదు చేసింది.

డీకే శివకుమార్ యే స్వయంగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికి లంచం డిమాండ్ చేశారని కాంట్రాక్టర్ల సంఘంలోని ఓ వర్గం ఆరోపణలు చేస్తోంది. దీంతో ప్రతిపక్షాలు కాంగ్రెస్ పై సెటైర్లు పేల్చుతున్నాయి. ఈక్రమంలోనే ఈ అంశంపై మంత్రి కేటీఆర్ తనదైన స్టైల్ లో ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. కర్ణాటక విజయోత్సవంతో జోష్ లో ఉన్న టీ కాంగ్రెస్ నేతలు తెంగాణలోనూ అక్కడి ఫలితాలను రిపీట్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు