వేసవిలో చల్లనీ డ్రింక్స్ తాగుతున్నారా అయితే జాగ్రత్త!

వేసవిలో కూల్ డ్రింక్స్ తాగుతున్నారా..? వేడిని తట్టుకోలేక ఫ్రిజ్‌లో ఉంచిన చల్లని నీళ్లు ఎడాపెడా తాగేస్తున్నారా.. వేసవి సీజన్‌లో బజార్లో దొరికే చెరుకు రసం లస్సీ, మజ్జిగ వంటి చల్లని పానియాలు సేవిస్తున్నారా.. అయితే జాగ్రత్త..!

New Update
వేసవిలో చల్లనీ డ్రింక్స్ తాగుతున్నారా అయితే జాగ్రత్త!

ప్రజల దాహార్తిని దృష్టిలో ఉంచుకుని కొందరు వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. కూల్‌‌డ్రింక్స్‌, ఐస్‌క్రిమ్‌లు నాసిరకంగా తయారు చేస్తున్నారు. అపరిశుభ్రంగా ఉండే నీటితో ఐస్‌లను తయారు చేస్తున్నారు. ఇదే ఐస్‌ను చెరకురసం, లస్సీ, మజ్జిగ వంటి వాటితో పోసి విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వేసవిలో ప్రత్యక్షమై సీజన్‌ ముగిశాక మాయమయ్యే ఈ వ్యాపారులు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోరు. ఈ విషయం తెలియక వీటిని తాగి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు.

నకిలీ కూల్‌డ్రింక్స్‌ తాగితే ఆస్తమా లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఊపిరితిత్తుల్లో గాలిని తీసుకెళ్లే ట్యూబ్‌లు పూర్తిగా మూసుకుపోయి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఇంట్లోని ఫ్రిజ్‌లో ఉన్న పదార్థాల జోలికి సైతం వెళ్లకూడదు. చిన్నపిల్లలు, వృద్ధులు రోడ్ల పక్కన దొరికే చల్లని పానీయాలు తాగడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌ చేరి అనేక వ్యాధులకు కారణమవుతాయి. సరైన ఐస్‌ను ఉపయోగించక పోవడం ఒక కారణమైతే వీటిని అమ్మేవారు శుభ్రత పాటించకపోవడం, రోడ్డుపై దుమ్ము, ధూళి వీటిపై పడటం మరో కారణం.

తొలుత గొంతునొప్పి(sore throat) తో సమస్య ప్రారంభమవుతుంది. తర్వాత గొంతు బొంగురుపోవడం, కఫం(Phlegm) పట్టడం, దగ్గు, జలుబుతో పాటు తీవ్ర జ్వరం వస్తుంది.అస్తమా బాధితులు, అవయవ మార్పిడి చేయించుకున్న వారు, కిడ్నీ, షుగర్‌, లివర్‌, సీవోపీడీ సమస్యలు ఉన్న వారిలో నిమోనియాకు దారి తీస్తుంది. చిన్న పిల్లల్లో దీర్ఘకాలిక దగ్గు, పొడిదగ్గు, ఆయాసం, కఫం పట్టడం, ఛాతీ బిగుసుకుపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

శుద్ధి చేయని నీటితో రోగాలు

స్థానికంగా శుద్ధిచేయని నీటితో తయారైన కూల్‌డ్రింక్స్‌‌తో నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు వైరల్‌ హెపటైటిస్‌ (పసిరికలు), డయేరియా (విరేచనాలు, వాంతులు), టైఫాయిడ్‌ జ్వరం వస్తాయి. కొన్ని రకాల బ్యాక్టీరియా జబ్బులు (అమీబియాసిస్‌) వస్తాయి. ఇందులో పచ్చకామెర్లు ప్రమాదకరం కాచి చల్లార్చిన నీటితో డ్రింక్స్‌ తయారు చేయాలి. సరిగ్గా నీటిని శుద్ధి చేయకుండా తాగకూడదు. రోగ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు