జ‌కోవిచ్‌ను ఓడించేది నేనే.. ఇట‌లీ టెన్నిస్ స్టార్ సంచ‌ల‌న వ్యాఖ్యలు

ఇట‌లీ టెన్నిస్ స్టార్ టెన్నిస్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ వింబుల్డ‌న్ టోర్నమెంట్ స్టార్ట్‌ అయింది. ఈసారి వ‌రల్డ్ నంబ‌ర్ వన్‌ కార్లోస్ అల్క‌రాజ్ టాప్ సీడ్‌గా, నొవాక్ జ‌కోవిచ్ బ‌రిలోకి దిగుతున్నారు. అయితే.. 8వ సీడ్ జానిక్ సిన్న‌ర్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశాడు. వింబుల్డ‌న్‌లో జ‌కోవిచ్‌ను ఓడించే ద‌మ్మున్న ఆట‌గాళ్లు కొంద‌రేన‌ని, అందులో నేనున్నాని తెలిపాడు.

జ‌కోవిచ్‌ను ఓడించేది నేనే.. ఇట‌లీ టెన్నిస్ స్టార్ సంచ‌ల‌న వ్యాఖ్యలు
New Update

italy-tennis-player-jackowich-win-down-one-and-only-me-seed-jannik-sinner-hot-comments-viral2

టెన్నిస్‌ స్టార్‌లు సూప‌ర్ ఫామ్‌లో ఉన్న ఈ ఇద్ద‌రిలో ఒక‌రు చాంపియ‌న్‌గా నిలిచే అవ‌కాశం ఉంద‌ని టెన్నిస్ విశ్లేష‌కులు అంటున్నారు. అయితే.. 8వ సీడ్ జానిక్ సిన్న‌ర్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశాడు. వింబుల్డ‌న్‌లో జ‌కోవిచ్‌ను ఓడించే ద‌మ్మున్న ఆట‌గాళ్లు కొంద‌రేన‌ని, వాళ్ల‌లో తాను ఒక‌డిని అని ఇట‌లీ స్టార్ అన్నాడు. నేను జ‌కోను మ‌ట్టి క‌రిపించేందుకు సిద్ధంగా ఉన్నా.. గ్రాస్ కోర్టులో నాదైన ఆట‌ను చూపించానంటే ఈసారి అత‌డికి ఓట‌మి త‌ప్ప‌దని సిన్న‌ర్ తెలిపాడు. 2022 వింబుల్డ‌న్ క్వార్ట్ ఫైన‌లో జ‌కోవిచ్ చేతిలో సిన్న‌ర్ అనూహ్యంగా ఓట‌మి చ‌విచూశాడు.

మొద‌టి రెండు సెట్లు గెలిచిన అత‌ను ఆ త‌ర్వాత చేతులెత్తేశాడు. ఇప్ప‌టికే ఏడుసార్లు వింబుల్డ‌న్ చాంపియ‌న్ అయిన జ‌కో ఎనిమిదో టైటిల్‌పై క‌న్నేశాడు. ఒక‌వేళ అత‌ను విజేత‌గా నిలిస్తే మాజీ ఆట‌గాడు రోజ‌ర్ ఫెద‌ర‌ర్ రికార్డును తిరగరాస్తూ రికార్డు బ్రేక్‌ చేస్తాడు. ఈ ఏడాది ఆరంభం నుంచి జ‌కోవిచ్ జోరు కొన‌సాగిస్తున్నాడు. ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ టైటిల్ నెగ్గిన అత‌ను ఫ్రెంచ్ ఓపెన్ విజేత‌గా నిలిచాడు. దాంతో, అత్య‌ధికంగా 23 గ్రాండ్‌స్లామ్స్ గెలిచిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. మ‌జీ నంబ‌ర్ 1 ర‌ఫెల్ నాద‌ల్ 22 గ్రాండ్ స్లామ్స్ రికార్డును బ‌ద్ధ‌లు కొట్టాడు. రెండో ర్యాంక‌ర్ అయిన జ‌కోకు ఈసారి వింబుల్డ‌న్‌లో సులువైన డ్రా ల‌భించింది.

జ‌కోవిచ్‌కు పోటీ వీళ్లే

అయితే.. అల్క‌రాజ్‌, మెద్వెదేవ్, త్సిత్సిపాటి, ముర్రే నుంచి ఈ సెర్బియా స్టార్‌కు గ‌ట్టి పోటీ ఎదురుకానుంది. ఈమ‌ధ్యే క్వీన్స్ క్ల‌బ్ ట్రోఫీ ఫైన‌ల్లో గెలిచిన అల్క‌రాజ్, జ‌కోను వెన‌క్కి నెట్టి మ‌ళ్లీ వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వన్‌ అయ్యాడు. ఇప్ప‌టివ‌ర‌కూ గ్రాస్ కోర్టులో 4వ రౌండ్ దాటిన అత‌ను ఈసారి టైటిల్ వేట‌లో అంద‌రికంటే ముందున్నాడు. మ‌రోవైపు తొడ కండ‌రాల గాయం నుంచి ఇంకా కోలుకోని ర‌ఫెల్ నాద‌ల్ ఇప్ప‌టికే టోర్నీ నుంచి వైదొలిగిన విష‌యం తెలిసిందే.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe