'గని' ఫ్లాప్ అవుతుందని ముందే తెలుసు: వరుణ్ తేజ్

గని సినిమా ఫ్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసు అని హీరో వరుణ్‌ తేజ్ తెలిపాడు. ఆ సినిమా విషయంలో తప్పు ఎక్కడ జరిగిందో తెలుసు.. ప్రతి సినిమాకు టార్గెట్ ఆడియన్స్ ఉంటారన్నాడు. కానీ గని సినిమాలో అన్ని రకాల ఆడియన్స్‌ను మెప్పించడానికి ప్రయత్నించామమని చెప్పాడు.

New Update
'గని' ఫ్లాప్ అవుతుందని ముందే తెలుసు: వరుణ్ తేజ్

వరుణ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్స్ లో ఒకటి గని. కొత్త దర్శకుడితో చేసిన ఈ సినిమా ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. అయితే ఈ సినిమా ఫ్లాప్ తో మెగా కాంపౌండ్ లో చాలా నిరాశ నెలకొంది. ఎందుకంటే అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబి ఈ సినిమాతో నిర్మాతగా మారాడు. ఎన్నో ఆశలతో గని సినిమా తీశాడు. కానీ డిజాస్టర్ అయింది.

అప్పట్లో గని సినిమా ఫ్లాప్ అయిన వెంటనే హీరో వరుణ్ తేజ్, ప్రేక్షకులందరికీ అపాలజీ లెటర్ రాశాడు. మంచి సినిమా ఇవ్వలేకపోయానని, క్షమించాలంటూ బహిరంగ లేఖ విడుదల చేశాడు. మళ్లీ ఇన్నేళ్లకు ఆ సినిమాపై స్పందించాడు వరుణ్ తేజ్. ఈ సారి అతడు చేసిన ప్రకటన మరింత సంచలనంగా మారింది. గని సినిమా ఫ్లాప్ అవుతుందనే విషయం వరుణ్ తేజ్ కు ముందు తెలుసంట.

"అవును.. గని సినిమా ఫ్లాప్ అవుతుందని నాకు ముందే తెలుసు. ఆ సినిమా విషయంలో తప్పు ఎక్కడ జరిగిందో నాకు తెలుసు. ప్రతి సినిమాకు టార్గెట్ ఆడియన్స్ ఉంటారు. కానీ గని సినిమాలో అన్ని రకాల ఆడియన్స్ ను మెప్పించడానికి ప్రయత్నించాం. నిజానికి అదొక స్పోర్ట్స్ డ్రామా. ఆ జానర్ కే ఫిక్స్ అయితే బాగుండేది. మరిన్ని జానర్లు యాడ్ చేశాం. అదే మేం చేసిన తప్పు."

ఇలా గని సినిమా ఫెయిల్యూర్ పై స్పందించాడు వరుణ్ తేజ్. అయితే తప్పు చేశామనే విషయం రిలీజ్ కు ముందే తెలిసినప్పటికీ, ఏదో మూల చిన్న నమ్మకం ఉండేదని, ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనే ఆశ ఉండేదని, కానీ రిలీజ్ తర్వాత ఆ చిన్న ఆశ కూడా ఆవిరైందని చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్.

తన కెరీర్ లో గని సినిమా కంటే ముందు కూడా ఫ్లాప్స్ ఉన్నాయని స్పష్టం చేసిన వరుణ్ తేజ్.. ప్రతి ఫ్లాప్ నుంచి ఓ పాఠం నేర్చుకుంటామని, అదే కెరీర్ కు ప్లస్ అవుతుందని చెబుతున్నారు. మిస్టర్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఎన్ని పాఠాలు నేర్చుకున్నాడో, గని సినిమా ఫెయిల్ అయినప్పుడు కూడా అన్నే పాఠాలు నేర్చుకున్నాడట.

మిస్టర్ సినిమాలో చేసిన తప్పులు తెలుసుకున్నాను కాబట్టే ఫిదా, తొలిప్రేమ లాంటి హిట్స్ ఇచ్చానని.. గని సినిమాలో జరిగిన తప్పులు కూడా తెలుసుకున్నాను కాబట్టి, మరిన్ని హిట్స్ ఇస్తానని అంటున్నాడు. ఈ హీరో తాజా చిత్రం గాండీవధారి అర్జున. ఈ నెల 25న థియేటర్లలోకి వస్తోంది ఈ సినిమా. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు