IT Raids: ఆ చిట్‌ కంపెనీల్లో నోట్ల కట్టలు.. ఐటీ దాడుల్లో సంచలనాలు..!

హైదరాబాద్‌ లో ఐటీ సోదాలు మరోసారి కలకలం రేపాయి. కూకట్ పల్లిలోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఆయన సోదరుల ఇళ్లలో సోదాలు జరగడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐటీ అధికారులు 100 బృందాలుగా విడిపోయి గురువారం ఉదయం నగరంలోని పలు కంపెనీలు, ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ప్రధానంగా చిట్ ఫండ్, ఫైనాన్స్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని సోదాలు కొనసాగుతున్నాయి.

IT Raids: ఆ చిట్‌ కంపెనీల్లో నోట్ల కట్టలు.. ఐటీ దాడుల్లో సంచలనాలు..!
New Update

హైదరాబాద్‌(Hyderabad)లో చిట్‌ఫండ్స్(Chit Funds), ఫైనాన్స్ కంపెనీలే టార్గెట్‌గా ఐటీ సోదాలు(IT Raids) కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎల్లారెడ్డిగూడ పూజ చిట్‌ఫండ్స్ కంపెనలో సోదాలు చేశారు అధికారులు. పూజ కృష్ణ చిట్‌ ఫండ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పైనా దాడులు జరిగాయి. కృష్ణ ప్రసాద్, దొప్పలపుడి పూజా, సోమేపల్లి నాగ రాజేశ్వరి, పూజ కృష్ణ, జీవన్ శక్తి, ఈ కామ్ చిట్‌ఫండ్స్ కంపెనీల్లోనూ సోదాలు చేశారు.



100 బృందాలుగా విడిపోయి సోదాలు:

ఐటీ అధికారులు 100 బృందాలుగా విడిపోయి గురువారం ఉదయం నగరంలోని పలు కంపెనీలు, ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున వెతకడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా చిట్ ఫండ్, ఫైనాన్స్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని సోదాలు కొనసాగుతున్నాయి. అమీర్ పేట, కూకట్ పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శంషాబాద్ లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అమీర్ పేటలోని ఎల్లారెడ్డిగూడలో పూజాకృష్ణ చిట్ ఫండ్ ను 20 బృందాలు తనిఖీ చేస్తున్నాయి.

CLICK HERE TO VIEW RTV WHATSAPP CHANNEL

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి ఇంటిపై దాడి:

కూకట్ పల్లిలోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఆయన సోదరుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. హౌసింగ్ బోర్డు 7వ ఫేజ్ లోని ఇందు ఫార్చ్యూన్ ఫీల్డ్స్ అపార్ట్ మెంట్స్ లోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. చిట్ ఫండ్ కంపెనీ యజమాని అరికెపూడి కోటేశ్వరరావు, రైల్వే కాంట్రాక్టర్ వరప్రసాద్ నివాసాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే వ్యాపారవేత్తలు ప్రసాద్, కోటేశ్వరరావు, ఎల్లారెడ్డిగూడకు చెందిన వ్యాపారి మాగంటి వజ్రనాథ్, శంషాబాద్లోని ఈ-కామ్ కంపెనీ మేనేజర్ రఘువీర్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. గత ఐదేళ్ల ఐటీ రిటర్నులపై వ్యక్తమవుతున్న సందేహాల కారణంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

తమిళనాడులో డీఎంకే ఎంపీ:

తమిళనాడులోని 70 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. డీఎంకే ఎంపీ జగద్రక్షకన్ ఇంటితో పాటు ఆయన కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నై, వేలూరు, కోయంబత్తూరు, అరక్కోణంలోని ఆయన కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో మొత్తం 150 మంది ఐటీ అధికారులు పాల్గొన్నారు.

ALSO READ: మరో 14 రోజులు జైల్లోనే.. ప్చ్‌.. చంద్రబాబుకు నిరాశే..!

#chitfund-it-raids #it-raids-in-hyderabad
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe