హైదరాబాద్‎లో ఐటీ రెయిడ్స్...బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ ఇంట్లో సోదాలు..!!

New Update

హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి.ఇవాళ ఉదయం నుంచి బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. కేపీహెచ్ బీలోని మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. మర్రి జనార్దన్ రెడ్డి వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు చెందిన పలు బట్టల షోరూమ్స్ లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

publive-image

ఇవాళ ఉదయం నుంచి బీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు ప్రజాప్రతినిథుల నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇళ్లలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయపు పన్ను, జీఎస్టీ విషయంలో అనుమానాలు తలెత్తడంతోనే ఈ సోదాలు నిర్వహిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. పైళ్ల శేఖర్ రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించిన సమయంలో కొన్ని విలువైన పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ అధికారుల సోదాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు భారీ మోహరించాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు