ఎండాకాలంలో ఈ రంగు బట్టలు వేసుకుంటే అసలు చిరాకే రాదు..

వేసవి లో వేడి పెరిగే కొద్దీ చెమట పెరుగుతుంది. బయటకు వెళ్లేటప్పుడైతే ఈ చెమటతో చికాకు తప్పదు. అందుకే సమ్మర్‌లో ఎటువంటి తరహా డ్రెస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలో ఇప్పటి నుంచే డిసైడ్ అవండి. కాటన్‌తోపాటు మరి కొన్ని ఫ్యాబ్రిక్స్ కూడా సమ్మర్‌లో వేసుకోవచ్చు. అవేంటో చూద్దాం.

ఎండాకాలంలో ఈ రంగు బట్టలు వేసుకుంటే అసలు చిరాకే రాదు..
New Update

వేసవి కాలంలో ఉక్కపోత వల్ల ఊపిరి సలపనీయదు. అందుకే తేలిగ్గా, పలుచగా ఉండే దుస్తులను ధరించాలి. ఏ డ్రెస్ వేసుకున్నా శరీరానికి బాగా గాలి తగిలేలా చూసుకోవాలి. అదే సమయంలో మనకు ఎండ నుంచి రక్షణ కూడా ఇవ్వాలి. అలాగే.. మన శరీరంపైన చెమటను పీల్చుకునే దుస్తులను ధరించాలి.వేసవిలో లైట్ వెయిట్ క్లాత్స్‌ వేసుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. కాటన్‌తోపాటు రేయాన్‌, లినెన్‌, లాన్, జెర్సీ, చాంబ్రే, మస్లిన్‌ దుస్తులు సమ్మర్ సీజన్‌కి అనువైనవి. వేసవి కోసమనే ఇప్పుడు స్పెషల్‌గా డిజైన్ చేసిన డ్రెస్సులు కూడా లభిస్తున్నారు. ఉక్కపోతలో కూడా సౌకర్యంగా ఉండటంతోపాటు ట్రెండీగానూ కనిపిస్తాయి.

కాటర్ వస్త్రాలను వేసుకుంటే ఆ చల్లదనమే వేరు. అన్ని వయసుల వారికీ తగినట్టుగా బోలెడన్ని మోడల్స్ కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. మెయింటైన్ చేయడం కాస్త కష్టమైనాసరే వేసవిలో కాటన్‌కి మించింది లేదు.సమ్మర్‌లో కూడా చీర కట్టులోనే వేడుకలకు వెళ్లాలనుకుంటే చందేరి సిల్క్, కశ్మీరీ సిల్క్‌, మట్క సిల్క్‌, క్రేప్‌ సిల్క్‌ వంటివైతే కంఫర్ట్‌నెస్‌తోపాటు లుక్ కూడా బాగుంటుంది. ఇంట్లోనే ఉండేటప్పుడు ఫ్రింటెడ్‌ కాటన్‌ చీరలు, హ్యాండ్‌లూమ్ సారీస్ ప్రిఫర్ చేస్తే మంచిది.

కాలేజీ స్టూడెంట్స్, ఉద్యోగినులు షార్ట్ మోడల్ కుర్తా, ప్రింటెడ్ బాటమ్‌ వేసుకుంటే సౌకర్యంగా ఉంటుంది. ప్లజెంట్‌గానూ కనిపిస్తారు. లాంగ్ మోడల్ సల్వార్లు, కుర్తాలను వేసవిలో పక్కన పెట్టేయండి. ఇలాంటివి వేసుకుంటే ఎండను తట్టుకోవడం కష్టం. ఆఫీసులకు డ్రెస్ కోడ్ కంపల్సరీ అనుకుంటే కాటన్ జీన్స్, కాటన్ షర్ట్స్ వేసుకుంటే మంచి లుక్‌ని ఇస్తాయి.వేసవి కాలంలో డార్క్ కలర్ డ్రెస్సుల జోలికి వెళ్లకండి. ముఖ్యండా బ్లాక్ కలర్ అస్సలు వాడకపోవడమే మంచిది. డార్క్ కలర్స్ వేడిని వెంటనే గ్రహించేస్తాయి. అందుకే.. వైట్ కలర్ లేదా లైట్ కలర్స్ వస్త్రాలను ఎంపిక చేసుకోండి. లైట్ బ్లూ, లైట్ వైలెట్, లైట్ పింక్, లైట్ ఎల్లో, లైట్ గ్రీన్.. ఇలా ఏ కలరైనా సరే లైట్‌గానే ఉంటే బెస్ట్. కాటన్ అయినా సరే మరీ టైట్‌గా లేదా మరీ లూజ్‌గా ఉండకుండా చేసుకోండి. దీని ద్వారా శరీరానికి సరైన గాలి తగులుతుంది.

#summer #color-clothes
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe