సిద్దిపేటలో ఐటీ హబ్‌... ప్రారంభించనున్న మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు

New Update

మంత్రి హరీష్ రావు ఇలాఖా అయినటువంటి సిద్దిపేట జిల్లాలో గురువారం (జూన్ 15) రోజున ఐటీ హబ్‌ను ప్రారంభించనున్నారు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుతో కలిసి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఐటీ హబ్‌ను ప్రారంభిస్తారు. సిద్దిపేట శివారులో అత్యాధునిక సదుపాయాలతో... రూ. 63 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ హబ్ ద్వారా ప్రత్యక్షంగా 750 మంది స్థానిక యువతకు, పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

telanganagallerynewsktr-and-harish-rao-will-be-inaugurated-siddipet-it-tower-it-hub

ఐటీ హబ్‌లో టాస్క్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు శిక్షణా తరగతులను నిర్వహించనున్నారు. ప్రతి 45 రోజులకు ఒక బ్యాచ్‌కు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి బ్యాచ్‌కు 150 మంది చొప్పున శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఐటీ హబ్‌లో కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఇప్పటికే పలు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ప్రారంభోత్సవం రోజు నుంచే ఈ హబ్ లో కార్యకలాపాలు మొదలుపెట్టేలా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే సిబ్బంది నియామక ప్రక్రియను మొదలు పెట్టారు. ఇప్పటికే 8 వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. వారిని పలు దశల్లో పరీక్షించి అందులో అర్హులైన వారిని ఎంపిక చేసుకున్నారు.

నియామక ప్రక్రియలో విఫలమైన వారికి టాస్క్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వారి నైపుణ్యాలు మెరుగు పరుచుకునేలా శిక్షణ ఇవ్వనున్నారు. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన మౌలిక వనరులు, ప్రోత్సహంపై కంపెనీలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఐటీ టవర్ లో 720 మంది పని చేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో దాన్ని వేయికి పెంచేందుకు ప్ర భుత్వం రెడీ అవుతోంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe