IT Employees: హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులకు పోలీసుల షాక్

టీడీపీ చీఫ్ చంద్రబాబును ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందంటూ కొన్ని రోజులుగా టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీతో పాటు తెలంగాణలోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఐ యామ్ విత్ సీబీఎన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు

IT Employees: హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులకు పోలీసుల షాక్
New Update

IT Employees: టీడీపీ చీఫ్ చంద్రబాబును ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందంటూ కొన్ని రోజులుగా టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీతో పాటు తెలంగాణలోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఐ యామ్ విత్ సీబీఎన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. అయితే ఈ సందర్భంగా ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు కొంతమంది ఉద్యోగులపై లాఠీ ఛార్జీ వేసిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసుల తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఐటీ ఉద్యోగులకు పోలీసులు షాక్ ఇచ్చారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ చేపడుతున్న ఆందోళనపై పోలీసులు ఆంక్షలు విధించారు. మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నానక్ రాంగూడ, తదితర ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.

పోలీసులు ఆంక్షలపై ఐటీ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం..

ఐటీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు ఎలాంటి ముందస్తు పోలీసు అనుమతి లేదని మాదాపూర్ పోలీసులు తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఆందోళన చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడం ద్వారా వాహనదారులతో పాటు సామాన్య ప్రజలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని పేర్కొన్నారు. అలాగే ఆందోళన చేసే ఐటీ ఉద్యోగుల కంపెనీలకు నోటీసులు పంపిస్తామని కూడా వెల్లడించారు. అయితే పోలీసుల ఆంక్షలపై ఐటీ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆందోళనలు చేస్తుంటే పోలీసులు అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు. మరోవైపు ఆదివారం ఔటర్ రింగ్‌ రోడ్డుపై కార్లతో ఆందోళన చేపట్టాలని ఇప్పటికే ఉద్యోగులు పిలుపునిచ్చారు.

బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా..

మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ వాయిదా వేసింది. ఈనెల 19వ తేదీకి విచారణను వాయిదా వేసిన న్యాయమూర్తి ఆ లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకీ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో క్వాష్‌ పిటిషన్ పెండింగ్‌లో ఉన్న విషయాన్ని విచారణ సందర్భంగా ప్రస్తావించిన న్యాయమూర్తి.. మధ్యంతర బెయిల్‌పై ఇప్పుడు విచారిస్తే క్వాష్ పిటిషణ్‌పై ప్రభావవం పడుతుందని అభిప్రాయపడ్డారు. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ కోరిన నారా లోకేశ్

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe