Isro scientist N Valarmathi dies: 10..9..8..7..6..5..4..3..2..1..! ఇస్రో ఏ ప్రయోగం చేపట్టినా కౌంట్‌డౌన్‌కి అన్నిటికంటే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇస్రో(ISRO) ప్రయోగాలను దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా వీక్షిస్తోంది. ప్రయోగానికి ముందు వినపడే కౌంట్‌డౌన్ స్వరం అందరికి సుపరిచితమే.
ఆ వాయిస్ ప్రతిసారి మనం విన్నదే.. అయితే వాయిస్ మనకు వినపడదు. చంద్రయాన్-3, ఆదిత్య ఎల్-1 ప్రయోగ విజయాల సంబరాల్లో మునిగి తేలుతున్న ఇస్రో సైంటిస్టులు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. ఇస్రో శాస్త్రవేత్త వలర్మతి(Valarmathi) గుండెపోటుతో మరణించారు. ఆమె చివరి కౌంట్‌డౌన్ చంద్రయాన్-3 మిషన్.
Also Read: ఇస్రో న్యూ మిషన్.. చంద్రయాన్-4 ఎప్పుడంటే ..?
ఇస్రో సైంటిస్టుల సంతాపం:
వలర్మతి మరణంతో ఇస్రో సైంటిస్టులు నివాళులర్పించారు. 'శ్రీహరికోట నుండి ఇస్రో భవిష్యత్తు మిషన్ల కౌంట్‌డౌన్‌లకు వలర్మతి మేడమ్ వాయిస్ ఉండదు. చంద్రయాన్-3 ఆమె చివరి కౌంట్‌డౌన్ ప్రకటన. ఊహించని మరణం. చాలా బాధగా అనిపిస్తుంది' అని డాక్టర్ వెంకటకృష్ణన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వెంకటకృష్ణన్ మాజీ ఇస్రో డైరెక్టర్. నివేదికల ప్రకారం.. ఆమె గుండెపోటుతో శనివారం(సెప్టెంబర్ 2) సాయంత్రం చెన్నైలో మరణించారు. తమిళనాడులోని అరియలూర్‌కు చెందిన శ్రీమతి వలర్మతి, జూలై 31, 1959న జన్మించారు. ఆమె కోయంబత్తూరులోని ప్రభుత్వ సాంకేతిక కళాశాల నుంచి ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ చేయడానికి ముందు నిర్మలా బాలికల హయ్యర్ సెకండరీ పాఠశాలకు వెళ్లారు. 1984లో ఇస్రోలో చేరారు. అప్పటి నుంచి అనేక మిషన్లలో కీలక పాత్ర పోషించారు. ఆమె RISAT-1 ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా. 2015లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గౌరవార్థం తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం అవార్డును అందుకున్న మొదటి వ్యక్తిగా ఆమె.
సోషల్‌మీడియా సంతాపం
దివంగత ఇస్రో శాస్త్రవేత్తకు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో సంతాపం వెల్లువెత్తుతోంది. 'వలర్మతి మేడమ్ మరణించినందుకు నేను చాలా చింతిస్తున్నాను. ఆమె చాలా మందికి నిజమైన ప్రేరణ, ప్రతి లాంచ్ సమయంలో ఆమె వాయిస్ మిస్ అవుతుంది. ఓం శాంతి.' అని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు. '#AdityaL1 లాంచ్ సమయంలో ఆమె లేకపోవడం గమనించాను. ఆమె ఆఫీస్‌లో ఉండకపోవచ్చని అనుకున్నాను. అయితే ఈ విషాద వార్త వస్తుందని ఊహించలేదు. నేను నిజంగా ఆమెను కోల్పోయాను. ఓం శాంతి. 'ఇది వినడానికి చాలా బాధగా ఉంది. గత సంవత్సరం మా విక్రమ్-ఎస్ లాంచ్ కోసం మేము ఆమెతో కలిసి పనిచేశాము, దాని కోసం లాంచ్ కౌంట్‌డౌన్ కోసం ఆమె వాయిస్‌ని అందించింది'. అని వలర్మతితో తమకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. నిజానికి వలర్మతి దేశ ప్రజలకు నేరుగా తెలియకపోయినా ఆమె వాయిస్ మాత్రం తెలుసు. ముఖ్యంగా చంద్రయాన్-3 మిషన్ ప్రయోగం టైమ్‌లో ఆమె వాయిస్ అందరికి గుర్తిండిపోతుంది. ఆదిత్య ఎల్-1కి కౌంట్‌డౌన్ వలర్మతి చెప్పలేదు. ఆదిత్య ఎల్-1 ప్రయోగం జరిగిన కొద్ది గంటలకే ఆమె చెన్నైలో తుది శ్వాస విడిచారు.
ALSO READ: చంద్రుడిపై రోవర్ పని పూర్తైంది.. ఇస్రో కీలక ప్రకటన