Israel vs Hamas: నొప్పితో విలవలలాడిపోయాను.. 85 ఏళ్ల భామ్మ ఏం చెప్పిందంటే?

ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య జరుగుతున్న భీకర పోరులో అమాయకులు బలైపోతున్నారు. 400మందికి పైగా ఇజ్రాయెలీ పౌరులను గాజాలని సొరంగాల్లో హమాస్‌ బంధించిన విషయం తెలిసిందే. వారిలో ఇద్దరిని తాజాగా హమాస్‌ విడుదల చేసింది. అందులో 85ఏళ్ల భామ్మ అసలేం జరిగిందో వివరించింది. సొరంగాల్లో బందీగా ఉన్నప్పుడు ఓ డాక్టర్‌ తనకు వైద్య పరీక్షలు నిర్వహించేవారని చెప్పింది. హమాప్‌ మిలిటెంట్లు తమని మంచిగానే చూసుకున్నారని తెలిపింది.

New Update
Israel vs Hamas: నొప్పితో విలవలలాడిపోయాను.. 85 ఏళ్ల భామ్మ ఏం చెప్పిందంటే?

ఆమె పేరు యోచివెడ్‌ లిఫ్‌షిట్జ్(Yocheved Lifshitz), వయసు 85.. హమాస్(Hamas) విడుదల చేసిన ఇద్దరు ఇజ్రాయెలీ బందీలలో ఈ భామ్మ ఒకరు. హమాస్‌-ఇజ్రాయెల్‌(Israel) మధ్య భీకర పోరులో దాదాపు 400మందిని హమాస్‌ దళాలు బందీలు చేయగా.. ఇప్పటివరకు నలుగురిని విడుదల చేశారు. అందులో ఇద్దరిని ఇవాళే(అక్టోబర్ 24) విడుదల చేయగా.. అందులో ఒకరైన 85ఏళ్ల యోచివెడ్‌ అసలేం జరిగిందో వివరించారు. కిడ్నాప్‌ చేసే సమయంలో తనను బాగా కొట్టారని ఆ భామ్మ చెప్పుకొచ్చింది. నొప్పి తట్టుకోలేకపోయానని.. నరకం అనుభవించానని వాపోయింది. నిజానికి మూడు వారాల ముందే మమ్మల్ని హమాస్‌ మిలిటెంట్లు హెచ్చరించారని.. తమ పొలాలను కూడా ధ్వంసం చేశారని భామ్మ చెప్పింది. ఫైర్ బెలూన్‌లను పంపినా కూడా ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌(Israel Defence Forces) హమాస్‌ చర్యను తీవ్రంగా పరిగణించలేదని భామ్మ ఆరోపించింది. ఆమె మొత్తం మాట్లాడిన స్టేట్‌మెంట్లు వింటే ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో అర్థమవుతుందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మంచిగానే చూసుకున్నారట:
తనను కొట్టి కిడ్నాప్‌ చేసిన హమాస్‌ గాజా సొరంగాల్లోకి తీసుకెళ్లి బందీ చేశారని చెప్పిన భామ్మ.. అక్కడికి వెళ్లిన తర్వాత మాత్రం తనని మంచిగానే చూసుకున్నారని తెలిపింది. మేము ఖురాన్‌ను నమ్ముతామని చెప్పారని.. ఎక్కడా కూడా తనతో చెడుగా బిహేవ్‌ చేయలేదని చెప్పింది. యోచివెడ్‌ లిఫ్‌షిట్జ్ ఏం అన్నారో ఆమె మాటాల్లోనే 'మేము జబ్బు పడకుండా వారు నిజంగా సానిటరీ వైపు శ్రద్ధ తీసుకున్నారు. చాలా మంది మహిళలు అక్కడ ఉన్నారు. వారికి స్త్రీ పరిశుభ్రత గురించి తెలుసు. మమ్మల్ని బంధించిన వారు అక్కడ ప్రతిదీ చూసుకున్నారు. నేను ఆ సొరంగాల్లో బందీగా ఉన్నప్పుడు ఓ డాక్టర్‌ నాకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని మేం ఊహించలేదు. నేను బైక్‌పై ఉన్నప్పుడు తల ఒకవైపు, మిగతా శరీరం ఇంకోవైపు ఉంది. దారిలో ఓ యువకుడు నన్ను కొట్టాడు. నా ఎముకలు విరగ్గొట్టలేదు కానీ..నేను నొప్పితో విలవిల్లాడిపోయాను. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగింది. ఆ తర్వాత నన్ను గాజాలో ఉన్న సొరంగాల్లోకి తీసుకెళ్లారు.' అని భామ్మ చెప్పుకొచ్చింది.


ఫెన్సింగ్‌ ఉపయోగపడలేదు:
అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌లోని నిర్ ఓజ్‌పై జరిగిన దాడి గురించి కూడా భామ్మ తన అనుభవాలను చెప్పారు. తమ పనుల్లో తాము బిజీగా ఉన్న సమయంలో కిబ్బట్జ్ ఖరీదైన కంచెలను హమాస్‌ ఛేదించింది ఊర్లోకి ఎంట్రీ ఇచ్చిందన్నారు. ఇదంతా సడన్‌గా జరిగిపోయిందన్నారు. నిజానికి హమాస్‌ను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ ఉపయోగపడలేదని తెలిపారు. నిజమే హమాస్‌ దాడుల తర్వాత ఆ ప్రాంతంలో కొన్ని ఇళ్లు తగలపడిపోయాయి. మరికొన్ని ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కిటీకిలు విరిగిపోయాయి. కొన్ని ఇళ్లలోని ఫ్లోర్‌కి రక్తం ఇప్పటికీ కనిపిస్తోంది. బుల్లెట్లు కూడా కనిపిస్తున్నాయి. గాజా సరిహద్దు ప్రాంతం కావడంతో హమాస్‌ ముందుగా వీరినే టార్గెట్ చేసుకున్నారు. ఇక మిగిలిన బందీలను కూడా విడుదల చేయాలని హమాస్‌పై ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా విడుదల చేసిన వారి ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదని.. అందుకే విడుదల చేశామని హమాస్‌ ప్రకటించింది. మరి మిగిలిన బందీల సంగతేంటో అర్థంకాని పరిస్థితి దాపరించింది. కిడ్నాప్‌కు గురైన వారి కుటుంబసభ్యులకు ప్రతిక్షణం నరకంగా మారింది. తమ వారి కోసం ఎదురుచూస్తు కన్నీళ్లతోనే కడుపు నింపుకుంటున్నాయి బాధిత కుటుంబాలు.

Also Read: గాజాపై ఇజ్రాయెల్ పోరు.. ఆ దేశానికే ఎదురుదెబ్బ తగలవచ్చన్న ఒబామా..

Advertisment
తాజా కథనాలు