Israel- Iran War: ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్ రెడీ.. ఆ రోజే ప్రతీకారం తీర్చుకునేందుకు పక్కా స్కెచ్!

ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు ఇరాన్ పక్కా ప్లాన్ వేస్తోంది. యుద్ధం కంటే ముందే హనియే హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు మొస్సాద్‌లో ఇజ్రాయెల్ కీలక కమాండర్స్‌ని అంతం చేయాలని ఇరాన్ భావిస్తోంది. ఇందుకోసం డేట్ ఫిక్స్ చేసి, మరికొన్ని దేశాల మద్దతుతో అటాక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

New Update
Israel- Iran War: ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్ రెడీ.. ఆ రోజే ప్రతీకారం తీర్చుకునేందుకు పక్కా స్కెచ్!

Israel- Iran War: ఇజ్రాయెల్‌ను చావుదెబ్బ కొట్టేందుకు ఇరాన్ పక్కా వ్యూహాలు రచిస్తోంది. హనియే హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ మంత్రులు, టాప్ కమాండర్స్‌ను టార్గెట్ చేయాలని ప్లాన్ చేస్తోంది. యుద్ధం కంటే ముందు మొస్సాద్‌లో కీలక కమాండర్స్‌ని అంతం చేయాలని ఇరాన్ భావిస్తోంది. అంతేకాదు ఇప్పటికీఏ హిజ్బొల్లా ప్లాన్ గీసినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇప్పటికే శాటిలైట్ టెక్నాలజీ కోసం చైనాతో ఇరాన్ చర్చలు జరపగా.. యుద్ధంలో మరికొన్ని దేశాల మద్దతు కూడగట్టేందుకు కసరత్తులు చేస్తోంది. యుద్ధానికి త్వరలోనే ఇరాన్ డేట్ కూడా ఫిక్స్ చేయబోతుందని సమాచారం.

మరోవైపు గాజాలో నరమేథం కొనసాగుతోంది. శనివారం ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఒకే ఇంటిలో 18 మంది మృతి చెందారు. అలాగే గాజాలో పర్యటించిన ఐక్యరాజ్యసమితి బృందం ఎటు చూసినా శిథిలాల గుట్టలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తం 10 నెలల్లో 40 వేల మందికి పైగా మృతి చెందారని, మృతుల్లో మూడొంతుల మంది మహిళలు, చిన్నారులున్నట్లు తెలిపింది. ఇప్పటికే గాజా నుంచి లక్ష మంది పాలస్తీనియన్లు ఈజిప్ట్ పారిపోయారు. గాజాలో మరణాలపై అంతర్జాతీయంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. హిట్లర్ కాలాన్ని గుర్తు చేస్తోందంటూ పలు దేశాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు