Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్‌ యుద్ధంలో కన్నీటి దృశ్యాలు..!!

దేశం కోసం కదనరంగంలోకి దిగిన ఇజ్రాయెలీ జర్నలిస్టు తన భార్యకు వీడ్కోలు పలికిన వీడియో వైరల్ గా మారింది. యుద్ధానికి వెళ్తున్న నఫ్తాలీ.. తన భార్యను హత్తుకుని ఎమోషనల్ అయ్యారు. భర్త యుద్దానికి వెళ్తుండడంతో ఆ భార్య బోరున విలపిస్తోంది. యుద్దానికి వెళ్తే భర్త తిరిగి వస్తాడో రాడో అన్న భయంతో కన్నీటి పర్యంతమవుతోంది. భర్తను యుద్ధానికి పంపించడం ఇష్టం లేకపోయిన దేశాన్ని రక్షించుకునేందుకు వెనకడుగు వెయకుండా భర్తకు సెండాఫ్  ఇచ్చింది.

New Update
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్‌ యుద్ధంలో కన్నీటి దృశ్యాలు..!!

Israel-Hamas War: దేశం కోసం కదనరంగంలోకి దిగిన ఇజ్రాయెలీ జర్నలిస్టు తన భార్యకు వీడ్కోలు పలికిన వీడియో వైరల్ గా మారింది. యుద్ధానికి వెళ్తున్న నఫ్తాలీ.. తన భార్యను హత్తుకుని ఎమోషనల్ అయ్యారు. భర్త యుద్దానికి వెళ్తుండడంతో ఆ భార్య బోరున విలపిస్తోంది. యుద్దానికి వెళ్తే తిరిగి వస్తాడో రాడో అన్న భయంతో కన్నీటి పర్యంతమవుతోంది. తన భార్యను హత్తుకున్న ఫొటోను ఎక్స్‌లో షేర్ చేస్తూ భావోద్వేగ పోస్టు పెట్టారు నఫ్తాలీ.


హమాస్ మెరుపుదాడితో ఉక్కిరిబిక్కిరి అయిన ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగింది. తమ భూభాగంపై తీవ్ర నష్టం కలిగించిన హమాస్‌పై ఈసారి కొట్టే దెబ్బ మామూలుగా ఉండదని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. హమాస్ అకృత్యాలకు చలించిపోయిన ఇజ్రాయెలీలు కదనరంగంలోకి నేరుగా దిగుతున్నారు. ఈ క్రమంలో దాదాపు 3 లక్షల మందిని ఇజ్రాయెల్ ప్రభుత్వం సన్నద్ధం చేసింది. వీరిలో ప్రముఖ జర్నలిస్టు హనన్యా నఫ్తాలీ కూడా ఉన్నారు. యుద్ధానికి వెళ్తున్న నఫ్తాలీ.. తన భార్యను హత్తుకుని ఎమోషనల్ అయ్యారు. ‘‘నా దేశాన్ని రక్షించుకునేందుకు, సేవ చేసేందుకు వెళ్తున్నాను. నా భార్య ‘ఇండియా నఫ్తాలీ’కు గుడ్‌బై చెప్పేశాను. ఆమె నన్ను ఆశీర్వదించింది. భగవంతుడి రక్షణ నాకు అండగా ఉంటుందని చెప్పింది. ఇక నుంచి నా తరపున నా సోషల్ మీడియా ఖాతాను ఆమె నిర్వహిస్తుంది’’ అని రాసుకొచ్చారు.

ఆ తర్వాత నఫ్తాలీ మరో వీడియోను పోస్టు చేస్తూ.. తాను యుద్ధానికి వెళ్తున్నది తమ సరిహద్దులను కాపాడుకోవడం కోసం మాత్రమే కాదని, తమ ఇళ్లను, కుటుంబాలను కాపాడుకోవడానికని పేర్కొన్నారు. ఓ బాంబు షెల్టర్‌లో నఫ్తాలీ-ఇండియా ఇద్దరూ ఉన్న వీడియో వైరల్ అయింది. భర్త యుద్ధానికి వెళ్తుండడంతో ఆ భార్య ఆవేదన వర్ణించలేనిది. యుద్దానికి వెళ్తే తిరిగి ప్రాణాలతో వస్తాడో రాడో తెలియని పరిస్ధితి. నఫ్తాలీని హత్తుకుని కన్నీటిపర్యంతం చెందింది. భర్తను యుద్ధానికి పంపించడం ఇష్టం లేకపోయిన దేశాన్ని రక్షించుకునేందుకు వెనకడుగు వెయకుండా సెండాఫ్  ఇచ్చింది. ఇలా వేల మంది  దేశాన్ని కాపాడుకునేందుకు తమ  కుటుంబాలను వదిలేసి యుద్ధానికి వెళ్తున్నారు.


Also Read: వాళ్ళు మొదలు పెట్టారు.. మేము ముగిస్తాం..! ఆ ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్..!

#NULL
Advertisment
తాజా కథనాలు