Israel - Hamas War 7th day: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఏడో రోజు కొనసాగుతోంది. గాజా (Gaza) పై 6 వేల బాంబులు పేల్చారు ఇజ్రాయెలీయులు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌లో 1300 మంది, గాజాలో 1500 మంది మృతి చెందారు. ఇరువైపులా మరణించిన వారి సంఖ్య 2,800కు చేరింది. యుద్ధం రోజురోజుకు మరింత తీవ్రరూపం దాలుస్తోంది. ‘ఇది యుద్ధ సమయం’ అని ఇజ్రాయెల్ మిలటరీ అధికారులు పేర్కొనడం యుద్ధం మరింత తీవ్రరూప దాల్చే అవకాశం ఉందని చెప్పకనే చెబుతోంది. అయితే, ఈ యుద్ధంలో పాల్గొనేందుకు మేము సైతం అంటు రంగంలో దిగారు ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్ (Naftali Bennett) , మోడల్ నటాలియా ఫదీప్.
పాలస్తీనా (Palestinian) మిలిటెంట్ సంస్థ హమాస్‌తో ఇజ్రాయెల్ తరపున పోరాడేందుకు ఆ దేశ మాజీ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్ యుద్ధం రంగంలో కాలుపెట్టారు. మేజర్లయిన పౌరులందరూ నిర్ణీతకాలం పాటు సైన్యంలో ఇజ్రాయెల్‌కు సేవ చేయాలన్న నిబంధన మేరకు ఆయన కూడా సమర పోరాటం చేస్తున్నారు. సైనిక దుస్తులు ధరించిన ఆయన తోటి సైనికులతో కరచాలనం చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హమాస్ పై యుద్ధం చేసేందుకు మోడల్ నటాలియా ఫదీవ్ (Natalia Fadeev) సైన్యంలో చేరింది. నటిలియా ఇజ్రయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విజ్ఞప్తి మేరకు సైన్యంలో చేరింది. ఎప్పుడు తక్కువ దుస్తులు ధరించి ఉన్న ఫోటోస్ ను షేర్ చేసే నటాలియా ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన ఫోటోస్ ను, వీడియోలను పోస్ట్ చేస్తోంది. మానవత్వానికి దోహదపడడం తనకు గర్వకారణమని పేర్కొన్న నటాలియా..మనం గాజాను నిర్మూలించాలి..వారిని నాశనం చేయాలని పోస్ట్ చేసింది.
ఇరు దేశాల మధ్య యుద్ధం రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న తమ పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు అమెరికా చార్టర్ విమానాలను సిద్ధం చేస్తోంది. పాలస్తీనా మిలిటెంట్ల దాడిలో ఇప్పటి వరకు 27 మంది అమెరికన్లు మరణించారు. మరో 14 మంది జాడ కనిపించడం లేదు. ఇండియా కూడా తమ పౌరులను తరలించేందుకు ‘ఆపరేషన్ అజయ్’ను ప్రారంభించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు గాజాపై 6 వేల బాంబులు వేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది.
Also Read: హమాస్ బంకర్ల మీద ఇజ్రాయెల్ సైన్యం దాడులు…ఒళ్ళు గగుర్పొడిచే వీడియో