Israel-Hamas war: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మృత్యుఘోష..!!

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మృత్యు ఘోష కొనసాగుతోంది. గాజాపై నాన్‌ స్టాప్‌ గా బాంబుల వర్షం పడుతోంది. ఎక్కడ చూసిన భయానక పరిస్ధితులు కనిపిస్తున్నాయి. బాంబుల మోతతో ఇజ్రాయెల్, గాజా దద్దరిల్లుతోంది. వైమానికి దాడులతో పాలస్తీనా గ్రూపు హమాస్‌ను భీకర దాడుల చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మిలటరీ దాడులను ఉధృంతం చేసి హామాస్‌ను నామరూపాలు లేకుండా చేస్తున్నారు. గాజాలోని హమాస్ ఉగ్రవాదుల కేంద్రాలు సహా పలు భవాలను నేలమట్టం చేశాయి. ఇప్పటి వరకు ఇరువైపులా 3,000కుపైనే మరణించినట్లు తెలుస్తోంది.

New Update
Israel-Hamas war: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మృత్యుఘోష..!!

Israel-Hamas war: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మృత్యుఘోష కొనసాగుతోంది. గాజాపై నాన్‌ స్టాప్‌ గా బాంబుల వర్షం పడుతోంది. ఎక్కడ చూసిన భయానక పరిస్ధితులు కనిపిస్తున్నాయి. బాంబుల మోతతో ఇజ్రాయెల్, గాజా దద్దరిల్లుతోంది. వైమానికి దాడులతో పాలస్తీనా గ్రూపు హమాస్‌ను భీకర దాడుల చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. మిలటరీ దాడులను ఉధృంతం చేసి హామాస్‌ను నామరూపాలు లేకుండా చేస్తున్నారు.  గాజాలోని హమాస్ ఉగ్రవాదుల కేంద్రాలు సహా పలు భవాలను నేలమట్టం చేశాయి. ఇజ్రాయెల్ - హమాస్ ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న పోరు వల్ల ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం గాజాలో 1.80 లక్షల మంది నిరాశ్రయులైనట్టు సమాచారం.

గాజాలో ప్రతీకార వైమానిక దాడులతో కలిసి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య మూడు వేలకు దాటిందని ఇజ్రాయెల్ వర్గాలు పేర్కొంటున్నాయి. గాజా సరిహద్దు ప్రాంతమైన దక్షిణ ఇజ్రాయెల్‌ను హమాస్ ఉగ్రవాదుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. ఈ ప్రాంతంలోని మరిన్ని ప్రాంతాలతో పాటు రోడ్లను కూడా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్టు ఇజ్రాయెల్ రక్షణ వర్గాలు వెల్లడించాయి. హమాస్ లక్ష్యాలపై పూర్తి స్థాయిలో దాడులు చేయనున్నట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ ప్రకటించారు. గాజా సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించనున్నట్టు చెప్పారు. నిర్బంధంలో ఉన్న అందిరనీ విడిచిపెట్టినట్టు చెప్పారు. హమాస్ నియంత్రణలోని ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తీసుకున్నట్టు తెలిపారు. గాజా మునుపటి స్థితిలోకి వెళ్లడం అసాధ్యమని తేల్చి చెప్పారు. ఇందుకు హమాస్ విచారించడం ఖాయమన్నారు. గాజాలో మార్పును హమాస్ కోరుకుంటోందని, అది అనుకున్న స్థితి నుంచి 180 డిగ్రీలు మారుతుందన్నారు.

అంతిమంగా  ఇజ్రాయెల్  హమాస్ ను ఏరిపారేస్తుంది. గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు తీక్షణ దాడిని కొనసాగిస్తున్నాయి. దీంతో గాజాలో భవనాలు తునాతునకలు అవుతున్నాయి. గాయపడిన వారితో గాజాలోని ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటి వరకు ఇరువైపులా 3,000 కుపైనే మరణించినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్-హమాస్ వార్‌ ఐదో రోజుకు చేరుకుంది. రెండు వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి, గాజాలో ఇజ్రాయెల్ ప్రతీకార వైమానిక దాడులతో యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. రెండు దేశాలు బాంబులు, తుపాకుల మోతతో దద్దరిల్లుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు.

Also Read: ఇజ్రాయెల్-హమాస్‌లో కొనసాగుతున్న మరణ మృదంగం..!!

Advertisment
తాజా కథనాలు