ISPL: గల్లీ క్రికెట్ బాయ్స్.. బీ రెడీ..టెన్నిస్ బాల్ క్రికెట్ కోసం ఒక లీగ్.. 

గల్లీలో టెన్నిస్ బాల్ తో క్రికెట్ ఆడవారి కోసం ఒక లీగ్ ప్రారంభం కాబోతోంది. దేశవ్యాప్తంగా ఆరు జట్లు వచ్చే మర్చి నెలలో ముంబయి వేదికగా 19 మ్యాచ్ లు ఆడతాయి. ఇది టీ10 ఫార్మేట్. ఆటగాళ్ల కోసం ఫ్రాంఛైజీలు రెడీ అయ్యాయి. ఇవి ఫిబ్రవరి 24న జరిగే వేలంలో ఆటగాళ్లను కొనుక్కుంటాయి. 

New Update
ISPL: గల్లీ క్రికెట్ బాయ్స్.. బీ రెడీ..టెన్నిస్ బాల్ క్రికెట్ కోసం ఒక లీగ్.. 

ISPL:  క్రికెట్ అంటే  మనదేశంలో ఒక మతం లాంటిది. గల్లీల్లో… ఇంటి ముందు ఉన్న స్పేస్.. ఇక్కడా అక్కడా అని కాదు.. ఎక్కడ అవకాశం దొరికెతే అక్కడ.. చెక్క ముక్క.. కొబ్బరి మట్ట  ఇదీ అదీ అని కాదు ఏది దొరికితే దానితో.. క్రికెట్ ఆడేస్తారు మన పిల్లకాయలు. కొంచెం పెద్ద పిల్లలు ఒక మాదిరి బ్యాట్ పట్టుకుని టెన్నిస్ బంతి పట్టుకుని ఛాన్స్ దొరికితే చాలు గ్రౌండ్స్ లో వాలిపోతారు. ఇక్కడ గల్లీ టీమ్స్ చాలా ఉంటాయి. వారి మధ్యలో వరల్డ్ కప్ రేంజ్ టోర్నమెంట్స్ కూడా జరుగుతాయి. కాకపొతే, పెద్దగా డబ్బుల లెక్కలు కనపడవు అంతే. ఈ టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవారిలో గల్లీ స్టార్స్.. బస్తీ స్టార్స్.. ఇంకా చెప్పాలంటే సిటీ స్టార్స్ కూడా చాలామంది ఉంటారు. కొంచెం అవకాశం ఉన్న స్టార్స్ కార్క్ బాల్ క్రికెట్ కి వెళతారు. వీరి సంఖ్యా తక్కువే. మిగిలిన వారు ఇలా టెన్నిస్ క్రికెట్ ఆడుతూ సరదా తీర్చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇలా ఆసక్తి ఉంది.. గల్లీ నుంచి సిటీ స్టార్స్ వరకూ ఉన్న టెన్నిస్ బాల్ క్రికెట్ పోరగాళ్ల కోసం మంచి రోజులు వచ్చేస్తున్నాయి. మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఐపీఎల్ లాంటి సరికొత్త లీగ్ టెన్నిస్ బాల్ క్రికెటర్ల కోసం వచ్చేస్తోంది. అవును. ఆ వివరాలు ఇప్పుడు తెల్సుకుందాం. 

Also Read:  మాక్స్ వెల్ ముంచేశాడు.. మూడో టీ20ని చేజార్చుకున్న టీమిండియా

గల్లీ క్రికెట్ లో టాలెంట్ ఉన్న పిల్లగాళ్లను క్రికెట్ స్టేడియంలో స్టార్లుగా మార్చేయడానికి వస్తున్న క్రికెట్ లీగ్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL). ఇది ఎక్కడ ప్రారంభం అవుతోందో తెలుసా? క్రికెట్ కి పెద్ద అడ్డాగా చెప్పుకునే ముంబయిలో. ఎప్పటి నుంచి అంటే వచ్చే ఏడాది మార్చి లో ఈ లీగ్ ఉటుంది అని చెబుతున్నారు. గల్లీ క్రికెట్.. టెన్నిస్ బాల్ అని చిన్నగా తీసుకోకండి. ఇది కూడా కోట్ల రూపాయల ఖర్చుతో తీసుకువస్తున్న లీగ్. ఇది టీ10 ఫార్మేట్ లో ఉంటుంది. అంటే 10 ఓవర్ల మ్యాచ్ లన్నమాట. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, శ్రీనగర్ నుంచి మొత్తం ఆరు జట్లు ఈ టోర్నీలో ఆడుతాయి. ఇక ఇందులో మొత్తం 19 మ్యాచ్ లు ఉంటాయి. అన్నీ ముంబయిలోనే జరుగుతాయి. ఇప్పటికే ఈ ఆరు టీమ్స్ ని ఆరు ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. ప్రతి టీమ్ లో 16 మంది ఆటగాళ్లు.. 6గురు సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. వేలంలో ఒక్కో ప్లేయర్ కనీస ధర 3 లక్షలుగా నిర్ణయించారు. అయితే, ఆటగాళ్ల కొనుగోలు కోసం ఫ్రాంఛైజీలకు కోటి రూపాయల పరిమితి  ఇచ్చారు. ఈ టీమ్స్ కోసం ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 24న జరుగుతుంది. 

అదండీ విషయం.. గల్లీలో క్రికెట్ ఆడుతున్నాడని మీ అబ్బాయిని ఎందుకూ పనికిరావు అని ఇకపై మీరు అనలేరు. ఎందుకంటే.. ఈ టోర్నీ సక్సెస్ అయితే.. ఏమో ఏం చెబుతాం మీ అబ్బాయి కూడా గల్లీ నుంచి లీగ్ క్రికెట్ లో హీరో అయిపోతాడేమో.. చూద్దాం ఐపీఎల్ లా ఇది కూడా సూపర్ హిట్ అయి.. భవిష్యత్ లో సంచలనాలు సృష్టిస్తుందేమో?

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు