Iran Attack: 'చంపింది మేమే..' ఇరాన్‌ ఉగ్రదాడి జరిపింది ఈ ఇస్లామిక్‌ సంస్థే!

ఇస్లామిక్‌ స్టేట్‌ దాని అనుబంధ టెలిగ్రామ్‌ ఛానెల్‌ లపై దాడికి బాధ్యత వహిస్తూ ఓ ప్రకటన పోస్ట్‌ చేశారు. కెర్మాన్‌ లోని సాహెబ్‌ అల్‌- జమాన్‌ మసీదు సమీపంలో పేలుళ్లు సంభవించాయి.

New Update
Iran Attack: 'చంపింది మేమే..' ఇరాన్‌ ఉగ్రదాడి జరిపింది ఈ ఇస్లామిక్‌ సంస్థే!

Iran Attack:బుధవారం నాడు ఇరాన్ (Iran) లో జరిగిన ఉగ్రదాడుల్లో మృతుల సంఖ్య 103 కి చేరింది. కమాండ్‌ ఖాసీం సులేమానీ (Kasim Sulemani) వర్థంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద జరుగుతున్న వేడుకల్లో రెండు బాంబులు పేలడంతో ఆ ఘటనలో సుమారు 103 మంది మరణించగా..వందల మంది గాయపడ్డారు. ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఇస్లామిక్ స్టేట్ గురువారం ప్రకటన విడుదల చేసింది.

చంపింది మా సంస్థే..

వార్తా సంస్థ రాయిటర్స్‌ ప్రకటించిన నివేదిక ప్రకారం..ఇస్లామిక్‌ స్టేట్‌(Islamic State) దాని అనుబంధ టెలిగ్రామ్‌ ఛానెల్‌(Telegram Channel) లపై దాడికి బాధ్యత వహిస్తూ ఓ ప్రకటన పోస్ట్‌ చేశారు. కెర్మాన్‌ లోని సాహెబ్‌ అల్‌- జమాన్‌ మసీదు సమీపంలో పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లు జరిగిన తరువాత కెర్మాన్‌ లో కాల్పులు జరిగినట్లు గురువారం రాష్ట్ర మీడియా తెలిపింది.

రిమోట్‌ కంట్రోల్‌ ఉపయోగించి బాంబులు పేల్చినట్లు అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి. బాంబులను రెండు బ్యాగులలో తీసుకుని వచ్చి పేల్చినట్లు అధికారులు వివరించారు. కమాండర్‌ సులేమానీ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌ విదేశీ కార్యకలాపాల విభాగమైన ఖుద్స్‌ ఫోర్స్‌ కు సులేమానీ నాయకత్వం వహించారు.

2020 లో బాగ్దాద్‌ విమానాశ్రయంలో యూఎస్ డ్రోన్‌ దాడిలో ఇరాన్ టాప్‌ కమాండర్‌ హత్యకు గురైయ్యారు. ఈ క్రమంలో ఆయన సమాధి వద్ద ఇరాన్‌ ప్రజలు వేడుకలు నిర్వహిస్తున్నారు. సోలేమాని హత్య జరిగిన తరువాత వాషింగ్టన్‌, టెహ్రన్‌ మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాల మేరకు 2020 లో అమెరికా సులేమానిని హత్య చేసింది. ఆయన హత్యను నిరసిస్తూ అప్పుడే మిలియన్ల మంది ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.అమెరికన్ MQ-9 రీపర్ డ్రోన్ ప్రయోగించిన క్షిపణుల వల్ల ఆయన చనిపోయారు. సిరియాలోని డమాస్కస్ నుండి వచ్చిన తర్వాత బాగ్దాద్ విమానాశ్రయం నుండి, రష్యా మద్దతు ఉన్న బషర్-అల్ అసద్ పాలనకు ఇరాన్ మద్దతు ఇస్తోంది.

Also read: వైసీపీకి ఓటమి కళ్లెదుట కనిపిస్తోంది… అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడుతోంది!

Advertisment
తాజా కథనాలు