/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/CM-Revanth-Reddy-4.jpg)
ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ శ్రీకృష్ణ కాన్షియస్నెస్ (ISKCON) ఈ రోజు నిర్వహించిన జగన్నాథ రథోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవసేవే మాధవసేవ అనే సూక్తిని తెలంగాణ ప్రభుత్వం ఆచరిస్తోందన్నారు. మాదకద్రవ్యాలు, ఇతర జాడ్యాల నుంచి తెలంగాణ సమాజం విముక్తి పొందడానికి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఉపకరిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజం ప్రశాంతంగా, సస్యశ్యామలంగా ఉండాలనే ఇస్కాన్ సంస్థ వారి ప్రార్థనలు ఫలించాలని ఆకాంక్షించారు. తెలంగాణపై భగవంతుడి కృప కొనసాగాలని కోరుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.
సమాజం ప్రశాంతంగా, సస్యశ్యామలంగా ఉండాలనే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ శ్రీకృష్ణ కాన్షియస్నెస్ (#ISKCON) సంస్థ వారి ప్రార్థనలు ఫలించాలని, తెలంగాణపై భగవంతుడి కృప కొనసాగాలని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. @ISKCONHyderabad నిర్వహించిన జగన్నాథ రథోత్సవంలో ఆయన పాల్గొన్నారు.… pic.twitter.com/gfxRw5LXGd
— Telangana CMO (@TelanganaCMO) July 7, 2024