Anant Ambani Pre Wedding: పింక్ గౌనులో బార్బీ డాల్ లా మెరిసిన ఇషా అంబానీ..!

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల తనయ ఇషా అంబానీ..తన సోదరుడు అనంత్ ప్రీ వెడ్డింగ్ లో సందడి చేశారు. పింక్ గౌన్ ధరించిన ఇషా అంబానీ అబ్బురపరిచింది. అచ్చం బార్బీడాల్ వలే మెరిసిపోయింది. లండన్ కు చెందిన ప్రముఖ ష్యాషన్ డిజైన్ మిస్ సోహీ డిజైన్ చేశారు.

New Update
Anant Ambani Pre Wedding:  పింక్ గౌనులో బార్బీ డాల్ లా మెరిసిన ఇషా అంబానీ..!

Anant Ambani Pre Wedding ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల తనయ ఇషా అంబానీ..తన సోదరుడు అనంత్ ప్రీ వెడ్డింగ్ లో తళుక్కును మెరిశారు. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కోసం గులాబీ రంగు గౌను ధరించిన ఇషా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అనంత్ అంబానీ, రాధిక మర్చంగ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్లో శుక్రవారం మొదలయ్యాయి. ఈ వేడుకలు మార్చి 3 వతేదీ వరకు కొనసాగుతాయి.

కాగా ఇషా అంబానీ ధరించిన ఆఫ్ షోల్డర్ షీర్ గౌన్‌ను లండన్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ మిస్ సోహీ డిజైన్ చేశారు. ఈ గౌను అంతటా పూల మోటిఫ్‌లతో చక్కగా డిజైన్ చేశారు. ఇషా ఈ పింక్ కలర్ గౌనుపై రీగల్ నెక్‌పీస్, చెవిపోగులతో యాక్సెసరైజ్ చేసింది.

publive-image

ఆమె తన జుట్టును చక్కని బన్‌లో కట్టి, ఐలైనర్, బ్లష్, లిప్‌స్టిక్‌తో తన తేలికపాటి మేకప్ తో అద్భుతంగా కనిపించింది. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ నుండి ఇషా ఫస్ట్ లుక్‌ నెట్టింట్లో వైరల్ గా మారింది. అటు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు మూడు రోజుల్లో ఐదు స్పెషల్ ఈవెంట్లు జరుగుతాయి.

publive-image

ఇప్పటికే సెలబ్రిటీలు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలతో సహా 1,000 మంది అతిథులను ఆహ్వానించారు. బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్ వంటి ప్రపంచ ప్రముఖులు కూడా ఈ ప్రీ వెడ్డింగ్ కు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కు మరో భారీ షాక్…రూ. 5.49కోట్ల జరిమానా.!

Advertisment
తాజా కథనాలు