APCC Chief YS Sharmila:వైఎస్‌ఆర్ వాచ్ షర్మిల చేతికి .. కారణం ఇదేనా?

APCC అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఇవాళ బాధ్యతలు తీసుకున్నారు. అయితే .. తన నడవడికలోనూ, మాట తీరులోనూ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నే ఫాలో అవుతున్న షర్మిల ఇప్పుడు షర్మిల తండ్రి సెంటిమెంట్ ని కొనసాగిస్తూ YSR జ్ఞాపకార్థంగా తండ్రి వాచ్‌ పెట్టుకుని కనిపించడం విశేషం.

New Update
APCC Chief YS Sharmila:వైఎస్‌ఆర్ వాచ్ షర్మిల చేతికి .. కారణం ఇదేనా?

APCC Chief YS Sharmila: ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల (Sharmila) ఇవాళ బాధ్యతలు తీసుకున్నారు. అయితే .. తన నడవడికలోనూ, మాట తీరులోనూ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నే ఫాలో అవుతున్న షర్మిల ఇప్పుడు షర్మిల తండ్రి సెంటిమెంట్ ని కొనసాగిస్తూ అన్ని విషయాల్లోనూ తండ్రినే ఫాలో అవుతుండటం విశేషం.

YSR జ్ఞాపకార్థంగా తండ్రి వాచ్‌ పెట్టుకున్న షర్మిల
ఈ కార్యక్రమంలో షర్మిల YSR జ్ఞాపకార్థంగా తండ్రి వాచ్‌ పెట్టుకుని కనిపించడం విశేషం. మీరు పెట్టుకున్న వాచ్ మీ తండ్రి గారిదా అని ఈ ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తూనే.. తండ్రి వారసత్వం కొనసాగిస్తానని షర్మిల సమాధానం ఇచ్చారు..ఇక నుండి ఏ కార్యక్రమానికి హాజరయినా ఈ వాచ్ పెట్టుకొనే పాల్గొంటానని తెలిపారు.

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనులు
APCC భాధ్యతలు చేపట్టిన తరువాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై (Chandrababu), ఏపీ సీఎం జగన్ పై (CM Jagan) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇద్దరు కలిసి ఏపీని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. ఏపీ అప్పులు (AP Debts) రూ.10 లక్షల కోట్లకు చేరుకున్నాయని ధ్వజమెత్తారు.ఏపీకి రాజధాని (AP Capital) లేకుండా చేసిన ఘనత వీరిద్దరికి దక్కుతుందని.. టీడీపీ (TDP), వైసీపీ (YCP)ఈ రెండు పార్టీలు బీజేపీకి (BJP) మద్దతుదారులని ఫైర్ అయ్యారు.అధ్యక్ష పదవీ స్వీకారణ అనంతరం షర్మిల అధ్యక్షతన ఏపీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చించారు.

అన్ని స్థానాల్లో పోటీ

రాబోయే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని తెలిపారు షర్మిల. 23 నుండి అన్ని జిల్లాల పర్యటన జరుగుతుందని వెల్లడించారు. 9 రోజులు రోజుకి మూడు జిల్లాల్లో పార్టీలో చేరికలు ఉంటాయని అన్నారు. 24 నుండి పోటీ చేసే అభ్యర్థుల నుండి అప్లికేషన్లు తీసుకుంటాము అన్నారు.

దేశానికీ బీజేపీ అవసరం లేదు

మణిపూర్ లో జరిగిన సంఘటనలు వలన దేశానికి బీజేపీ అవసరం లేదని అన్నారు షర్మిల. పోలవరం, అమరావతి రాజధాని, వైజాగ్ స్టిల్ ప్లాంట్ లాంటి అన్ని విషయాల్లో ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని ఫైర్ అయ్యారు. వైసీపీ, టీడీపీ రెండు బీజేపీతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. రాష్టంలో 25 మంది ఎంపీలు బీజేపీ వల్లే అని పేర్కొన్నారు.

ఏపీకీ ప్రత్యేకహోదా

గత పదేళ్లుగా అధికారంలో ఉండి వైసీపీ, టీడీపీ పార్టీలు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా చేశారని మండిపడ్డారు షర్మిల. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లు షర్మిల తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనకు ముఖ్యం అని అన్నారు. తాను ఎవరు వదిలిన బాణం కాదు అని స్పష్టం చేశారు.

ALSO READ:చంద్రబాబును సీఎం చేయాలనే.. షర్మిలకు సజ్జల కౌంటర్

Advertisment
తాజా కథనాలు