Onion Price: మళ్ళీ ఉల్లి ధరలు కన్నీళ్లు తెప్పిస్తాయా? మార్కెట్ వర్గాలు ఏమంటున్నాయి? 

ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి అనుకుంటున్న ఉల్లి ధరలు త్వరలో మళ్ళీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఉల్లి పంట తక్కువగా అందుబాటులోకి రావడం.. రంజాన్ పండుగ.. డిమాండ్ పెరిగే అవకాశంతో మార్చి 15 తరువాత ఉల్లిధరల్లో పెరుగుదల కనిపించవచ్చని అంచనా వేస్తున్నారు. 

New Update
Onion Export: నిషేధం ఎత్తివేయడంతో ఉల్లి ఎగుమతులు మళ్లీ పెరిగాయి

Onion Prices: ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్న ఉల్లిధరలతో ఊరట చెందుతున్న వారికి మళ్ళీ షాక్ తప్పేలా కనిపించటం లేదు. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం ఉల్లిపాయలు కొనాలంటే కష్టం అనిపించే పరిస్థితి రావచ్చు. ఎందుకంటే సరఫరాలో కొరత కారణంగా మార్చి ప్రారంభంలో ఉల్లి ధరలు పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఖరీఫ్ పంట కోత వరకు దేశంలో ఉల్లి సరఫరాలో భారీ కొరత ఏర్పడే అవకాశం ఉంది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం, ఉల్లి వ్యాపార పరిశ్రమకు చెందినవారు.. రబీ ఉల్లి పంట ఉత్పత్తిలో 30 శాతం క్షీణత ఉందని చెబుతున్నారు.  వారి అంచనా ప్రకారం ఉత్పత్తి తగ్గడం..  పరిమిత సరఫరా కారణంగా మార్చి ప్రారంభంలో రంజాన్ సమయానికి ఉల్లి ధరలు పెరిగే అవకాశం ఉంది.

మనదేశంలో ఉల్లి ఎగుమతుల్లో (Exporting) ప్రధాన పాత్ర పోషించే వ్యాపారుల బృందం, కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల ఒక లేఖ రాశారు. దీని ప్రకారం ఉల్లి ఎగుమతుల విషయంలో జాగ్రత్తలు అవసరమని పేర్కొన్నారు.  ఎగుమతి పరిమాణాలను నియంత్రించడానికి సరైన యంత్రాంగాలను అనుసరించకుండా ఉల్లి ఎగుమతులను అనుమతించడం వల్ల కలిగే పరిణామాల గురించి ప్రభుత్వాన్ని ఈ లేఖలో హెచ్చరించారు.  ప్రభుత్వ అధికారులతో సమావేశమైన ఎగుమతిదారులు, 3,00,000 టన్నుల ఉల్లిని ఎగుమతి చేశారనే ఇటీవల వచ్చిన కొన్ని వార్తల నేపథ్యంలో.. నాసిక్ (Nashik) జిల్లా మార్కెట్‌లో ఉల్లి ధరలు(Onion Price) కిలో రూ.35-40కి, ఇతర రిటైల్ మార్కెట్‌లలో కిలో రూ.50-60కి పెరిగాయని పేర్కొన్నారు. 

Also Read: మేడారం జాతర ఏ ఊరి నుంచి ఎంత దూరం, ఎంత ఛార్జ్?.. ఫుల్ లిస్ట్ ఇదే..!!

మార్చి ప్రారంభం నుంచి ఉల్లి ధరలు(Onion Price) పెరగడంతో పాటు డిమాండ్ కూడా గణనీయంగా పెరుగుతుందని ఎగుమతిదారులు భావిస్తున్నారు. రంజాన్ పండుగ కారణంగా డిమాండ్ పెరగడం అలాగే ఉల్లిపంట తక్కువ రావడం కూడా ధరల పెరుగుదలకు దారితీయవచ్చనేది నిపుణుల అంచనా. మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్‌లో ఉల్లి పంట చాలా తక్కువగా అందుబాటులోకి వచ్చ్చింది.  ఇప్పుడు ఖరీఫ్ పంట చివరి దశలో ఉందని, మరో 15 రోజుల్లో మార్కెట్లోకి ఉల్లి రావడం మరింత తగ్గుతుందని చెప్పారు. రబీ ఉల్లి పంట మార్చి మధ్య తర్వాత మార్కెట్‌లకు వచ్చే అవకాశం ఉంది. గతేడాది కంటే రబీ ఉల్లి ఉత్పత్తి తక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.  దేశీయ మార్కెట్‌లో ధరలు పెరగడం..  సరఫరాలో కొరత భయం కారణంగా, డిసెంబర్ 2023 నుండి మార్చి 2024 వరకు ఉల్లిపాయల ఎగుమతిని నిషేధించారు.

గత వర్షాకాలంలో మహారాష్ట్ర, కర్ణాటక, భారతదేశంలోని అనేక ఇతర రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గడం గమనార్హం. 2023లో రుతుపవనాల సక్రమంగా లేకపోవడంతో, పప్పులు, చక్కెర, ఉల్లి(Onion Price) వంటి ప్రధాన ఆహార పదార్థాల ఉత్పత్తి కూడా ప్రభావితమైంది. గతేడాదితో పోలిస్తే కందిపప్పు ఉత్పత్తిలో దాదాపు 13 శాతం తగ్గుదల ఉన్నట్లు అంచనా. పరిశ్రమ అంచనాల ప్రకారం, కందిపప్పు తదుపరి పంట వచ్చే వరకు ఏడాది పొడవునా రిటైల్ మార్కెట్లో ఎక్కువ ఖరీదైనదిగా ఉంటుందని భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు