సాధారణంగా కారు పైకప్పు లోహంతో తయారై ఉంటుంది. అయితే సన్‌రూఫ్ ఉన్న కార్లలో ఎక్కువ భాగం గాజు మెటీరియల్ ఉంటుంది. ఈ గాజు ప్రాంతం సూర్యరశ్మిని గ్రహిస్తుంది. దీనివల్ల కారు లోపలి భాగం, సాధారణ పైకప్పులు ఉన్న కార్ల కంటే ఎక్కువగా వేడెక్కుతుంది. దీంతో జర్నీ సౌకర్యంగా ఉండకపోవచ్చు.వేసవిలో సన్‌రూఫ్స్ ఉన్న కార్లలో ఏసీ పెంచాల్సి వస్తుంది. దీనివల్ల మైలేజీపై నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. లోపలి క్యాబిన్‌ను చల్లబరచడానికి AC ఎక్కువ ఎనర్జీ వినియోగిస్తుంది. దీంతో ఫ్యూయల్ వినియోగం పెరుగుతుంది. చివరికి వెహికల్ యావరేజ్ మైలేజీ తగ్గుతుంది. తక్కువ మైలేజీ కారణంగా ఫ్యూయల్ కాస్ట్స్ ఎక్కువ అవుతాయి.
సన్‌రూఫ్ కారులో ఉండే ఎక్కువ వేడి, ఎయిర్ కండిషనింగ్ (AC) సిస్టమ్‌పై ఒత్తిడిని కలిగిస్తుంది. సన్‌రూఫ్ ఓపెన్‌లో ఉంటే కారు లోపలి భాగం ఇంకా ఎక్కువగా వేడెక్కుతుంది. దీంతో కారును చల్లగా ఉంచడానికి ఏసీ చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ పెరిగిన పనిభారం ఏసీ సామర్థ్యాన్ని, పనితీరును ప్రభావితం చేస్తుంది. దాని సాధారణ సామర్థ్యాన్ని మించి పనిచేసేలా ప్రెజర్ పెడుతుంది. దీంతో AC పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ. అదే జరిగితే రిపేర్ ఖర్చులు భరించాల్సి వస్తుంది.సన్‌రూఫ్స్ కార్లు మంచి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి, కారు లోపలికి ఎక్కువ కాంతిని తీసుకువస్తాయి.
ఆహ్లాదకరమైన వాతావరణంలో సన్‌రూఫ్ ఓపెన్ చేసి డ్రైవ్ చేస్తే, చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అయితే భారతదేశం వంటి ప్రాంతాలలో ఈ ఫీచర్‌తో ఎదురయ్యే నష్టాలను కొనుగోలుదారులు దృష్టిలో పెట్టుకోవాలి. సన్‌రూఫ్ ఉన్న కారు కొనాలని ఆలోచిస్తుంటే, తక్కువ మైలేజీ, ఎక్కువ వేడి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వేసవిలో లాంగ్ డ్రైవ్స్‌కు ఇవి బెస్ట్ ఆప్షన్ కాకపోవచ్చు.సన్‌రూఫ్ ఉన్న కారు బిల్ట్ క్వాలిటీ కూడా తక్కువగా ఉంటుంది. చిన్న పిల్లలు లేదా పెంపుడు జంతువులు దీనివల్ల గాయపడే ప్రమాదం ఉంది. సన్‌రూఫ్‌లలో లీకేజీలతో కారు లోపలి భాగం దెబ్బతినవచ్చు.