India Alleince: ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి.. ఇండియా కూటమి పరిస్థితి ఏమిటి?

మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో మార్పులు తెస్తుందా? ప్రాంతీయపార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ ను మరింత ఇరకాటంలో పెడతాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇండియా కూటమి పరిస్థితిపై విశ్లేషణ కోసం హెడింగ్ పై క్లిక్ చేసి పూర్తి ఆర్టికల్ చూడండి. 

New Update
India Alleince: ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి.. ఇండియా కూటమి పరిస్థితి ఏమిటి?

India Alleince: మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన తర్వాత, కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన ఇండియా కూటమి పరిస్థితి ఏమిటి అనేది పెద్ద ప్రశ్నగా మారింది. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా దేశంలోని ఆ పార్టీని వ్యతిరేకించే పెద్దా.. చిన్నా పార్టీలన్నిటినీ ఇండియా (INDIA) పేరుతొ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు అతి ముఖ్యమైన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరాజయం తరువాత.. ప్రస్తుత బీజేపీ విజయం మోదీ విజయంగా దేశమంతా చెప్పుకుంటున్న వేళలో ఇండియా కూటమి విధానం, వ్యూహంలో ఎలాంటి మార్పు వస్తుందనేది కూడా ప్రశ్న, ఎన్నికల ఫలితాలకు ముందు ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ స్థాయి ఇప్పుడు కూడా అలాగే ఉంటుందా? ఇండియా కూటమిలోని సభ్యులందరి వైఖరి అలాగే ఉందా? ఎన్నికల ఫలితాల ముందు ఉన్న సమీకరణాలు ఇప్పుడు  ఫలితాల తర్వాత మళ్లీ రీ సెట్ అవుతాయా? ఇలాంటి ప్రశ్నల మధ్య ఇండియా కూటమి నాలుగో సమావేశం డిసెంబరు 6న ఢిల్లీలో జరగనుంది. 

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మొత్తం 28 విపక్షాలను India Alleince సమావేశానికి పిలిచారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమికి ఇదే తొలి సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలపై చర్చించే అవకాశం ఉంది. ఇండియా కూటమి సమావేశానికి ముందు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమి సమావేశం గురించి తనకు సమాచారం లేదని చెప్పారు. బహుశా పార్టీలో ఎవరికైనా చెప్పారేమో కానీ, మీటింగ్ గురించి నాకు తెలియదు అంటూ ఆమె వ్యాఖ్యానించడం రాజకీయంగా చర్చను లేపింది. 

మొత్తం 28 విపక్షాలు.. ఈ ఎన్నికలపై కసరత్తు చేశాయి.. 

ఇప్పటి వరకు మమతా బెనర్జీ  ఇండియా కూటమి(India Alleince) అన్ని సమావేశాలకు హాజరయ్యారు. అటువంటి పరిస్థితిలో, ఇప్పుడు ఆమె చేసిన ఈ ప్రకటన అర్థం ఏమిటి? అనేదానిపై ఆసక్తి కలుగుతోంది. మరోవైపు కాంగ్రెస్‌తో సంబంధాలపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన ప్రకటన..  ఆయన ఈ సమావేశంలో పాల్గొనే విషయంలో సందిగ్ధత ఉందని అనిపిస్తోంది. ఇండియా అలయన్స్ చివరి సమావేశం ముంబైలో ఆగస్టు 31-సెప్టెంబర్ 1 వరకు జరిగింది. ఈ సమావేశంలో కూటమి 5 కమిటీలను ఏర్పాటు చేసింది. వీటిలో ప్రచార కమిటీ, సమన్వయ - వ్యూహ కమిటీ, మీడియా, సోషల్ మీడియా - పరిశోధనా కమిటీ ఉన్నాయి. ఈ సమావేశంలో 28 విపక్షాలు అసెంబ్లీ ఎన్నికలపై వ్యూహాలు రచించగా.. ఇప్పుడు ఈ రాష్ట్రాల ఫలితాలు వచ్చాయి. పరిస్థితి మారిపోయింది.  కాబట్టి తర్వాత  సమావేశం-వ్యూహం చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. 

Also Read: ఎన్నికల కోడ్‌ ఎత్తివేత.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన

ఇండియా కూటమి(India Alleince) సమావేశంలో ఏం జరగనుంది? ఏకాభిప్రాయం వస్తుందా లేక కొత్త విభేదాలు, అభిప్రాయాలు బయటపడతాయా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతం 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నుంచి కొన్ని సూచనలు వెలువడ్డాయి. దీని తీవ్రతను విపక్షాలు అర్థం చేసుకోవాల్సి ఉంది. 

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఏమి సూచిస్తున్నాయి?

  • మొదటి స్పష్టమైన సంకేతం - లోక్‌సభ ఎన్నికలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అతిపెద్ద కారకంగా మారబోతున్నారు.
  • రెండవ సంకేతం- 3 రాష్ట్రాల్లో బంపర్ విజయం తర్వాత, బీజేపీకి 2024 సార్వత్రిక ఎన్నికల సన్నాహాలకు బూస్టప్ తీసుకువచ్చింది. 
  • మూడవ సంకేతం- మూడు రాష్ట్రాల ఓటమి తర్వాత, 2024 ఎన్నికలలో మోడీ వర్సెస్ రాహుల్ అనే కథనాన్ని కాంగ్రెస్ సెట్ చేయలేకపోవచ్చు.
  • నాల్గవ సంకేతం- ఇండియా కూటమిలో కాంగ్రెస్‌కు ఇక్కట్లు పెరుగుతాయి. ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ కు మరింత తలనొప్పిగా మారే పరిస్థితి ఉంటుంది. 
  • ఐదవ సంకేతం- ఎంపీ రాజస్థాన్‌లో బీజేపీ హిందూ కార్డుతో  దెబ్బ తిన్న తర్వాత, కాంగ్రెస్ కు లోక్ సభ ఎన్నికల్లో హిందుత్వ సమస్య పెద్దది అవుతుంది.

ఇక ఈ ఎన్నికల ద్వారా బీజేపీకి కూడా పెద్దఛాలెంజ్ తీసుకువచ్చాయి. మహిళలు - గిరిజనుల ఓట్లు 2024లో గేమ్ ఛేంజర్‌గా మారుతాయని ఈ ఓట్ మీటర్లు సూచిస్తున్నాయి. అయితే, దక్షిణాదిలో కమలం వికసించాలంటే సరికొత్త వ్యూహంతో పనిచేయడం బీజేపీకి సవాల్‌గా మారనుంది.

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు