Janwada Farmhouse: హైడ్రా నెక్స్ట్ టార్గెట్ జన్వాడ ఫామ్ హౌజ్?.. సోషల్ మీడియాలో వైరల్!

గతంలో రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నపుడు జన్వాడలో నిబంధనలు ఉల్లంఘించి కేటీఆర్ ఫామ్ హైజ్ కట్టారని ఆరోపించారు. అక్కడ డ్రోన్ ఎగరవేశారంటూ ఆయనపై కేసు కూడా పెట్టి జైలుకు పంపించింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే.. ఇప్పుడు హైడ్రా నెక్ట్స్ కూల్చేది ఆ ఫామ్ హౌజ్ నే అన్న చర్చ సాగుతోంది.

New Update
Janwada Farmhouse: హైడ్రా నెక్స్ట్ టార్గెట్ జన్వాడ ఫామ్ హౌజ్?.. సోషల్ మీడియాలో వైరల్!

Janwada Farmhouse:  హైడ్రా.. ఇప్పుడు హైదరాబాద్ లో ఈ పేరు చెబితేనే అక్రమార్కుల గుండెలు జారిపోతున్నాయి. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాకా తీసుకువచ్చిన హైడ్రా ఎక్కడ అక్రమ కట్టడం కనిపించినా కాల్చివేయడమే విధిగా ముందుకు సాగిపోతోంది. ఈ క్రమంలో రాజకీయనాయకులు.. నేతలు.. ఎవరినీ కూడా ఉపేక్షించడం లేదు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కూడా హైడ్రా షాకిచ్చింది. దీంతో తరతమ బేధాలు లేకుండా ఎవ్వరినీ కూడా వదిలిపెట్టరు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర చర్చ కూడా సోషల్ మీడియా వేదికగా నడుస్తోంది. 

అది కూడా కూల్చేస్తారా?
రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా  ఉన్న సమయంలో సుమారు నాలుగేళ్ళ క్రితం జన్వాడ ఫామ్ హౌస్ పై పెద్ద యుద్ధమే చేశారు. జీవో 111 ను అతిక్రమించి స్విమ్మింగ్ పూల్, ఇతర సదుపాయాలతో నిర్మాణాలు జరిగాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అన్నిటి కంటే ముఖ్యంగా కేటీఆర్ దానికి యజమాని అంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఉస్మాన్ సాగర్ లోకి వర్షపు నీరు చేర్చే నాలాను ఆక్రమించారని తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. అందుకు సంబంధించిన ఫోటోలను విడుదల చేసి సంచలనం సృష్టించారు. అప్పుడు అక్కడ డ్రోన్ ఎగరవేశారు అనే కేసు కూడా రేవంత్ పై అప్పటి ప్రభుత్వం పెట్టింది.

ఆయనను అరెస్ట్ చేసింది. అయితే,  ఈ జన్వాడి ఫామ్ హౌస్ తనది కాదంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాలు చేశారు. దీంతో కోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై స్టే విధించింది.  రోజులు మారాయి.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు అక్రమార్కులపై హైడ్రా కొరడా ఝుళిపిస్తున్నారు. దీంతో ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో మళ్ళీ ట్రేండింగ్ అవుతోంది. ఇప్పుడు హైడ్రా హిట్ లిస్ట్ లో ఈ ఫామ్ హౌస్ కూడా ఉంది అంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది. 

ముందుగా జన్వాడ ఫామ్ హౌస్ కూల్చేస్తారా? అంటూ రేవంత్ సైన్యం తెలంగాణ పేరుతో X లో ఒక ట్వీట్ వచ్చింది. మిత్తితో సహా చెల్లిస్తాం అని క్యాప్షన్ తో ఆ ట్వీట్ వచ్చింది. దీంతో ఆ ట్వీట్ పై సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే మొదలైంది. పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అంతేకాకుండా, కేటీఆర్ అభిమానులు కూడా X వేదికగా దాని జోలికి వచ్చారో మేము కూడా ఊరుకునేది లేదు అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. హైడ్రా ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ ను టార్గెట్ చేసింది అని చర్చ నడుస్తోంది. ఇప్పటికే, హైడ్రా ఆ కట్టడాలపై సమాచారాన్ని సేకరిస్తోందని అంటున్నారు. 

మొత్తంమ్మీద హైడ్రా నగర శివార్లలో అక్రమ కట్టడాలపై నడిపిస్తున్న బుల్ డోజర్ జన్వాడ మెడకు మళ్లుతుందా లేదా నఏ చర్చ మాత్రం గట్టిగా నడుస్తోంది. మరోవైపు అటువైపు కన్నేసే ముందు కాంగ్రెస్ నాయకుల అక్రమ కట్టడాల వైపు కూడా కన్నేయండి అంటూ కూడా బీఆర్ఎస్ అభిమానులు ట్వీట్స్ తో సోషల్ మీడియాలో మోత మోగిస్తున్నారు.

బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి క్రిషాంక్ కాంగ్రెస్ మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే వివేక్ ఫామ్ హౌజ్ ల సంగతేంటో చెప్పాలని కౌంటర్ ట్వీట్లు చేశారు. దీంతో హైడ్రో నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉంటుందనే అంశంపై తెలంగాణలో జోరుగా చర్చ సాగుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు