/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-11T201622.334.jpg)
శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్లో కచ్చితంగా ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి అంటున్నారు. ప్రోటీన్ అనేది శరీరానికి అవసరమైన, అతిముఖ్యమైన సోర్స్. ఇవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేసి.. మిమ్మల్ని సంతృప్తిగా ఉంచుతాయి. ఆకలి తగ్గి.. అన్ హెల్తీ స్నాక్స్ జోలికి వెళ్లకుండా ఉండేలా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా గ్లూకాగాన్ లాంటి పెప్టెడ్, కోలిసిస్టోకినిన్ వంటి హార్మోన్లు కడుపు నిండుగా ఉండేలా హార్మోన్లను ప్రేరేపిస్తాయి. ఆకలిని తగ్గించడమే కాకుండా.. కడుపు నిండుగా ఉండి.. చిరుతిళ్లవైపు దృష్టి మళ్లకుండా చేస్తాయి.
పనీర్, చికెన్.. ఈ రెండూ ప్రోటీన్‌కు మంచి సోర్స్. వీటిలో ప్రోటీన్‌తో పాటు.. పొటాషియం, మెగ్నీషియ, కాల్షియం వంటి పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును కంట్రోల్ చేయడంలో, తగ్గించడంలో సహాయం చేస్తాయి. అయితే ఈ రెండూ బరువు తగ్గడంలో ఎలాంటి ఫలితాలు చూపిస్తాయో.. వీటిని ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో.. హెల్తీగా ఉండడంలో ఈ రెండు చేసే ప్రయోజనాలపై నిపుణులు ఇచ్చే సలహా ఏమిటో తెలుసుకుందాం. దీని గురించి తెలియాలంటే అసలు చికెన్, పనీర్‌లో ఎంత ప్రోటీన్ ఉందో తెలుసుకోవాలి.
వంద గ్రాముల పనీర్ తీసుకుంటే దానిలో 18 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. అలాగే చికెన్‌ను 100 గ్రాములు తీసుకుంటే దాని ద్వారా మీరు 27 గ్రాముల ప్రోటీన్‌ను పొందవచ్చు. అయితే 100 గ్రాముల పనీర్ తీసుకోవడం వల్ల 22 గ్రాముల కొవ్వు లభిస్తుంది. చికెన్‌లో దీని శాతం చాలా తక్కువ. 3 గ్రాముల కొవ్వు మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా పనీర్, చికెన్‌లలో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. కేలరీల విషయానికొస్తే.. పనీర్‌లో 265 నుంచి 320 కేలరీలు ఉండగా.. చికెన్‌లో 165 కేలరీలు మాత్రమే ఉంటాయి.
పనీర్‌లో 60 శాతం కొవ్వు.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది గుండె జబ్బులకు దారి తీసే అవకాశముంది. ఈ విషయాన్నిదృష్టిలో పెట్టుకుని.. చికెన్ మంచిదా? పనీర్ బెటరా? అనే విషయాలు తెలుసుకోవాలి. మీరు వెజ్ మాత్రమే తినేవారు అయితే మీ ప్రయారిటీ కచ్చితంగా పనీర్ అవుతుంది. ఒకవేళ రెండూ తినేవారు అయితే.. కేలరీల కౌంట్ తగ్గించుకోవడం కోసం చికెన్‌ను తీసుకోవచ్చు. ఇది అన్ని విషయాల్లో బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మెరుగైన జీర్ణక్రియ అందిస్తుంది. కానీ పనీర్ త్వరగా అరిగిపోతుంది. చికెన్ కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది.