Life Style: అమ్మాయిల కంటే అబ్బాయిలు తెలివైనవారా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి..?

అమ్మాయిల కంటే అబ్బాయిలు తెలివైనవారా? అబ్బాయిల కంటే ఆడపిల్లల మెదడు కార్యకలాపాలు చాలా క్లిష్టంగా ఉంటాయని చెబుతున్నారు. అయితే దీని గురించి తాజాగా వెలువడిన పరిశోధనలు ఏం చెబుతున్నాయి..? తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ లోకి వెళ్ళండి.

New Update
Life Style: అమ్మాయిల కంటే అబ్బాయిలు తెలివైనవారా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి..?

Life Style: అధ్యయనాల ప్రకారం.., పిండాలు, నవజాత శిశువులలో నాడీ వ్యవస్థ పెరిగినప్పుడు, మెదడులోని సంకేతాల సంక్లిష్టత తగ్గినట్లు కనిపించింది.  అబ్బాయిలు ఈ వ్యవస్థను అమ్మాయిల కంటే చాలా వేగంగా అభివృద్ధి చెందినట్లు తేలింది.

అబ్బాయిలు తెలివైనవారా..? లేదా అమ్మాయిలా..? అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇది ఎప్పటికీ ఎండ్ అవ్వని చర్చే అని చెప్పాలి. అయితే జర్మనీలోని ట్యూబింజెన్ విశ్వవిద్యాలయం చేసిన తాజా పరిశోధనల ప్రకారం మగపిల్లల కంటే ఆడపిల్లలలో మెదడు పనితీరు చాలా క్లిష్టంగా(Complex) ఉన్నట్లు వెల్లడించారు.

అధ్యయనం సమయంలో, పరిశోధకులు మాగ్నెటోఎన్సెఫలోగ్రఫీ (MEG) అనే ఇమేజింగ్ టెక్నిక్‌ని ఉపయోగించి పిండాలు, శిశువులలో మెదడు విద్యుత్ ప్రవాహాల ద్వారా ఉత్పత్తి చేయబడిన అయస్కాంత క్షేత్రాల ధ్వని ఉద్దీపనలను కొలిచారు. 13 నుండి 59 రోజుల మధ్య వయస్సు గల 20 మంది నవజాత శిశువులను, 43 త్రైమాసిక దశలో ఉన్న పిండాల నుంచి డేటాను పరిశీలించారు పరిశోధకులు. గర్భిణీ స్త్రీ బొడ్డు MEG సెన్సార్‌ల ద్వారా  “సౌండ్ బ్యాలన్” ఉపయోగించి పిండాలకు ధ్వని ప్లే చేయబడింది.

ఈ అధ్యయనం ప్రకారం.. అమ్మాయిల కంటే అబ్బాయిల మెదడు పనితీరు వేగంగా అభివృద్ధి చెందింది. పిండాలు, నవజాత శిశువులలో నాడీ వ్యవస్థ పెరిగినప్పుడు, మెదడులోని సంకేతాల సంక్లిష్టత తగ్గినట్లు కనిపించింది. అమ్మాయిలతో పోలిస్తే.. అబ్బాయిలలో ఈ వ్యవస్థను వేగంగా అభివృద్ధి చెందిందని గుర్తించారు. పరిశోధన సమయంలో పిల్లలో మెదడు పనితీరును ధ్వని ఉద్దీపన ప్రతిస్పందనతో  కొలిచారు. MEG( magnetic encephalography) సిగ్నల్ సంక్లిష్టతను సూచించడానికి అల్గారిథమ్‌లను ఉపయోగించారు.

అధిక మెదడు సంక్లిష్టత, తక్కువ మెదడు సంక్లిష్టత మధ్య తేడా

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మెదడు సంక్లిష్టత ఎక్కువగా ఉన్న వ్యక్తులు ప్రణాళిక, నిర్ణయం తీసుకోవడం వంటి పనులను అమలు చేయడంలో అత్యుత్తమ పనితీరు, వేగవంతమైన ప్రతిచర్యను కలిగి ఉంటారు.

అయితే, తక్కువ స్థాయి మెదడు సంక్లిష్టతలు సమాచార ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని దెబ్బతీసే అంశాలతో ముడిపడి ఉంటుంది.

పిండం పెరిగేకొద్దీ, పిల్లలు వయస్సు పెరిగే కొద్దీ మెదడు సంకేతాల సంక్లిష్టత పెరుగుతుందని పరిశోధకులు అంచనా వేశారు. అయితే, భవిష్యత్తులో ఆడవారితో పోలిస్తే మగవారిలో ఇది వేగంగా తగ్గుతుందని గుర్తించారు. ఏమైనప్పటికీ, కారణం స్పష్టంగా వెల్లడించలేదు. మెదడు అభివృద్ధి చెందుతున్న సమయంలో దాని ప్రక్రియలను సులభతరం చేసుకోవడానికి అవసరం లేని కణాలను తొలగించడం ద్వారా కూడా ఇది జరగవచ్చు అని అంచనా.

Advertisment
తాజా కథనాలు