Ponguleti: కాంగ్రెస్‌లో చేరిన 15రోజులకే పొంగులేటికి షాక్..భూకబ్జా ఆరోపణలతో టెన్షన్ టెన్షన్..! మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొదరుడు ప్రసాద్‌రెడ్డికి ఇరిగేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు.ఖమ్మం శివారులోని గోపాలపురంలో పొంగులేటి స్థలం దగ్గర అధికారుల సర్వే చేపట్టారు. పొంగులేటి SR గార్డెన్స్ పరిధిలో 21.50 గుంటల భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. By Trinath 18 Jul 2023 in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి ఇటివలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గట్టి షాక్ తగిలింది. పొంగులేటి సోదరుడు ప్రసాద్‌రెడ్డిని భూకబ్జా ఆరోపణలు చుట్టుముట్టాయి. 21.50 గుంటల ప్రభుత్వ స్థలాన్ని ప్రసాద్‌రెడ్డి ఆక్రమించినట్టు అధికారులు చెబుతున్నారు. ఖమ్మం శివారులోని గోపాలపురంలో పొంగులేటి స్థలం దగ్గర అధికారుల సర్వే చేపట్టారు. NSP కెనాల్ భూముల ఆక్రమణపై అధికారుల సర్వే చేస్తుండగా పొంగులేటి అనుచరులు, కాంగ్రెస్ శ్రేణులు వాళ్లని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అధికారులకు, పొంగులేటి అనుచురులకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే పోలీసులు సీన్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో అధికారులు సర్వే పూర్తి చేశారు. ఆక్రమిత స్థలం వరకు మార్కింగ్ చేశారు రెవెన్యూ అధికారులు. పొంగులేటి SR గార్డెన్స్ పరిధిలో 21.50 గుంటల భూమి ఆక్రమణకు గురైనట్లు నిర్థారణకు వచ్చారు. దీనిపై ఇప్పటికే పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికి నోటీసులు కూడా జారి చేశారు. టార్గెట్ చేశారా? బీఆర్‌ఎస్‌తో తెగదెంపులు చేసుకొని ఇటివలే కాంగ్రెస్ కండువా కప్పుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కావాలనే ప్రభుత్వం టార్గెట్ చేసిందంటూ కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తోంది. బీఆర్‌ఎస్‌లో ఉన్నన్ని రోజులు జరగని సర్వే ఇప్పుడెందుకు జరిగిందని.. కాంగ్రెస్‌లో చేరకముందు వరకు రాని భూకబ్జా ఆరోపణలు ఇప్పుడెందుకు వచ్చాయని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఇదంతా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే బీఆర్‌ఎస్ చేస్తోందని మండిపడుతోంది. అయితే నిజానికి ఆయన బీఆర్‌ఎస్‌లో ఉన్న రోజుల్లో కూడా భూకబ్జా ఆరోపణలు వచ్చాయని..కానీ అధికారులే చర్యలు తీసుకోలేదని పలువురు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో లేకపోవడంతోనే చర్యలు తీసుకునేందుకు వచ్చారని.. అందుకే పొంగులేటి సోదరుడికి నోటీసులు కూడా ఇచ్చినట్టు అభిప్రాయపడుతున్నారు. పువ్వాడ అజయ్ కుమార్‌పై ఆగ్రహం: ఉన్నట్టుండి గోపాలపురంలోకి అధికారులు, పోలీసులు రావడం.. సర్వే చేయడంతో అక్కడికి పెద్ద ఎత్తున పొంగులేటి అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. వాళ్లంతా అధికారులు తీరును తప్పుపట్టారు. భూకబ్జా నిజమైతే పొంగులేటి బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు ఎందుకు సర్వే చేయలేదని నిలదీస్తున్నారు. మరోవైపు దీని వెనుక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఖమ్మంలో పొంగులేటి ఆయనకు ప్రత్యర్థిగా మారిపోయారని తెలిసినప్పటి నుంచి పువ్వాడ ఈ కుట్రలకు తెరదీశారని వాదిస్తున్నారు. ఓటమి భయంతోనే అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారంటూ మండిపడుతున్నారు. పువ్వాడ మట్టి దౌర్జన్యం చేస్తున్నారని..ఈ ప్రభుత్వానికి దమ్ము, దైర్యం ఉంటే నిఘా పెట్టాలని ఎదురుతిరుగుతున్నారు. పువ్వాడకు ఒక న్యాయం.. పొంగులేటికి ఒక న్యాయం ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. ఒక పబ్లిక్ హాలీడే రోజు, అది కూడా ముందస్తు సమాచారం లేకుండా సర్వే ఎలా చేస్తారని.. ఒకవేళ పద్ధతిగా అడిగి వచ్చి ఉంటే బాగుండేదని..అప్పుడు తాము అధికారులను అడ్డుకునేవాళ్లం కాదని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. #పొంగులేటి #భూకబ్జా #పువ్వాడ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి