Iron Deficiency: వీటిని తీసుకోండి రక్తహీనతకు చెక్ పెట్టండి!

శ‌రీరంలో జీవ‌క్రియ‌ల‌ను వేగ‌వంతం చేయడంతో పాటు ర‌క్తంలో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా స‌హా ప‌లు శారీరక విధులు నిర్వ‌ర్తించ‌డంలో ఐర‌న్ కీల‌క పాత్ర పోషిస్తుంది. అయితే చాలా మందిలో రక్తహీనతం ప్రధాన సమస్యగా ఉంది. ఈ క్రమంలో వీటికి చెక్ పెట్టాడానికి నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు.అవేంటంటే?

New Update
Iron Deficiency: వీటిని తీసుకోండి రక్తహీనతకు చెక్ పెట్టండి!

Iron Deficiency Treatment: శ‌రీరంలో జీవ‌క్రియ‌ల‌ను వేగ‌వంతం చేయడంతో పాటు ర‌క్తంలో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా స‌హా ప‌లు శారీరక విధులు నిర్వ‌ర్తించ‌డంలో ఐర‌న్ కీల‌క పాత్ర పోషిస్తుంది. ఐర‌న్ లోపంతో ర‌క్త‌హీన‌త బారిన‌ప‌డి ఇబ్బందులు ఎదుర్కొనే వారు ఇటీవ‌ల గ‌ణ‌నీయంగా పెరుగుతుండ‌టం ఆందోళ‌న రేకెత్తిస్తోంది. ముఖ్యంగా వేస‌విలో మనం తీసుకునే ఆహారంలో ఐర‌న్ అధికంగా ఉండే ఆహార ప‌దార్ధాలు ఉండేలా చూసుకోవ‌డంతో ఐర‌న్ లోపాన్ని చాలావ‌ర‌కూ అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు.

పాల‌కూర‌లో ఐర‌న్ అధికంగా ఉండ‌టంతో రోజూ ఈ ఆకుకూర‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌చ్చు. పాల‌కూర‌తో పాటు సిట్ర‌స్ పండ్లు, బెల్‌పెప్ప‌ర్స్ శ‌రీరం ఐర‌న్‌ను స‌క్ర‌మంగా సంగ్ర‌హించేందుకు తోడ్ప‌డ‌తాయి. ఇక ప‌ప్పు ధాన్యాలు ఐర‌న్‌తో పాటు ఫైబ‌ర్‌ను క‌లిగిఉండటంతో జీర్ణ‌క్రియ సాఫీగా సాగేలా చేస్తాయి.

Also Read: స్పైడర్ మ్యాన్ జోడీకి బిగ్ షాక్.. అరెస్ట్ చేసిన పోలీసులు!

ట‌మాటాలు, నిమ్మ‌ర‌సంతో పాటు సూప్స్‌, స‌లాడ్స్‌, సైడ్ డిష్‌గా లెంటిల్స్‌ను తీసుకోవ‌చ్చు. ఐర‌న్‌, ప్రొటీన్‌, ఫైబ‌ర్ అధికంగా ఉండే శ‌న‌గ‌ల‌ను ఉడికించి తీసుకుంటే ర‌క్త‌హీన‌త‌ను అధిగ‌మించ‌వ‌చ్చు. ఐర‌న్ లోపాన్ని అధిగ‌మించే ఆహార ప‌దార్ధాలివే..

పాలకూర‌,ప‌ప్పు ధాన్యాలు,శ‌న‌గ‌లు,క్వినోవా,గుమ్మ‌డి గింజ‌లు,ఆప్రికాట్స్‌,డార్క్ చాక్లెట్స్‌,సోయా బీన్స్‌ వీటిని తీసుకోవటం ద్వారా మీ వయసు పెరిగినట్లు అసలు కనిపించదని నిపుణులు చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు