Iran vs Israel: చిన్న దేశం ఇజ్రాయెల్ కానీ.. ఇరాన్ తో ధీటైన ఆయుధ సంపద.. ఆ లెక్కలివే!

జనాభా పరంగా అతి చిన్నదేశమైన ఇజ్రాయెల్ తనకంటే ఎన్నోరెట్లు ఎక్కువ జనాభా కలిగిన పెద్ద దేశం ఇరాన్ తో యుద్ధానికి సిద్ధపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ దగ్గర ఉన్న సైనిక, ఆయుధ సంపద ఎంత ఉందో  ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు 

Iran vs Israel: చిన్న దేశం ఇజ్రాయెల్ కానీ.. ఇరాన్ తో ధీటైన ఆయుధ సంపద.. ఆ లెక్కలివే!
New Update

Iran vs Israel: ప్రస్తుతం ప్రపంచ యుద్ధ భయాలు అందర్నీ వెంటాడుతున్నాయి. ఆ ఏమీ కాదు.. యుద్ధం రాదులే అనే ఆశ ఉన్నప్పటికీ.. పరిస్థితులు మాత్రం ఒక పెద్ద యుద్ధం వైపు దారితీస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలు యుద్ధ మేఘాల మధ్యలో బిక్కు బిక్కు మంటున్నాయి. ఒక పక్క రష్యా- ఉక్రెయిన్ మధ్య యద్ధం చాలాకాలంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం రెండు దేశాల మధ్య శతృత్వం ఎంత ఉన్నా.. ఒకదానిపై ఒకటి దాడులు చేసుకోలేదు. కానీ, ఇప్పుడు ఇజ్రాయెల్ పై ప్రత్యక్షంగా దాడికి దిగింది ఇరాన్. దీంతో ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగవచ్చనే సంకేతాలు బలంగా అందుతున్నాయి. అంతే కాకుండా అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతుగా రంగంలోకి దిగింది. దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్ కనుక ఇరాన్ పై  ప్రతీకార దాడికి దిగితే, అది ప్రపంచ యుద్ధంగా పరిణమించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 

యుద్ధం అంటే మాటలు కాదు కదా. ప్రపంచ యుద్ధం మాట పక్కన పెడితే, ఇరాన్-ఇజ్రాయెల్ (Iran vs Israel)మధ్య ప్రత్యక్షంగా యుద్ధ మొదలయితే.. ఎవరిదీ పై చేయి అవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే.. అసలు ఏ దేశం సైనిక బలం ఎంత అనే విషయం అర్ధం చేసుకోవాలి. ప్రపంచ దేశాల్లో సైనిక బలం విషయంలో ఇరాన్ 14వ స్థానంలో ఉంది. అదే ఇజ్రాయెల్ 17వ స్థానంలో ఉంది. సైనిక బలమే కాకుండా ఇతరత్రా అంశాలు కూడా యుద్ధంలో జయాపజయాలను నిర్ణయిస్తాయి. ఇప్పుడు ఇరాన్.. ఇజ్రాయెల్ రెండు దేశాలలో ఉన్న ఆయుధ బలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 

ఇరాన్, ఇజ్రాయెల్(Iran vs Israel) రెండిటి దగ్గరా హైరేంజ్ మిస్సైల్స్ ఉన్నాయి. ఇరాన్‌ దగ్గర ఉన్న మిస్సైల్స్ లో 

సెజిల్‌ -2,500కి.మీ., ఖైబర్‌ -2,000కి.మీ., హాజ్‌ ఖాశీం -1,400కి.మీ., షాహబ్‌-3 -800-1000కి.మీ. రేంజ్ లక్ష్యాలను ఛేదించగలవు. 

ఇక ఇజ్రాయెల్ దగ్గర ఉన్న జెరికో-1-1,400కి.మీ., జెరికో-2 -2,800కి.మీ., జెరికో-3 -5,000కి.మీ. రేంజ్ లక్ష్యాలను ఛేదించే సామర్ధ్యంతో ఉన్నాయి. 

Iran vs Israel: ఇరాన్‌ దగ్గరఖలీద్‌ ఫర్జ్‌ నౌకా విధ్వంసక క్షిపణులు ఉన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్‌ దగ్గర ఖండాంతర అస్త్రాలు ఉన్నాయి.  ఇరాన్ దగ్గర శక్తివంతమైన మొహజెర్‌-10అనే అధునాతన డ్రోన్‌ వ్యవస్థ ఉంది. దానికి ధీటుగా పేట్రియాట్‌, యారో, డేవిడ్‌ స్లింగ్‌, ఐరన్‌ డోమ్‌ వంటి అధునాతన డ్రోన్లు అందుబాటులో ఉన్నాయి. 

Iran vs Israel: అణ్వాయుధాల విషయానికి వస్తే కనుక.. ఇరాన్‌ దగ్గర హైపర్‌సోనిక్‌ బాలిస్టిక్‌ క్షిపణి ఉంది. అలాగే  ఇజ్రాయెల్‌ చేతిలో 90అణుబాంబులు ఉన్నాయి. ఇరాన్ రిజర్వ్‌ దళాలు 3.5 లక్షలు కాగా ఇజ్రాయెల్ దగ్గర 4.65లక్షలు రిజర్వ్ దళాలు అందుబాటులో ఉన్నాయి. 

Iran vs Israel: ఇక సైనిక పాటవం గురించి చెప్పుకోవాలంటే.. ఇరాన్‌  సైనిక సిబ్బంది 6.1 లక్షలు కాగా     ఇజ్రాయెల్‌ 1.7 లక్షల సైనికులను కలిగి ఉంది. అలాగే, యుద్ధ ట్యాంకులు ఇరాన్ దగ్గర 1,966 ఉంటే, ఇజ్రాయెల్ 1,370 కలిగి ఉంది. ఇరాన్‌ టోవ్డ్‌ ఆర్టిలరీ  2,050 కాగా, ఇజ్రాయెల్‌  టోవ్డ్‌ ఆర్టిలరీ 300గా ఉంది. 

Also Read: మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా నో టెన్షన్.. ఈ దేశాలకు వెళ్తే అందరూ సేఫ్!

Iran vs Israel: ఇరాన్ దగ్గర 580, ఇజ్రాయెల్ దగ్గర 650 శతఘ్నులు, ఇరాన్ దగ్గర 775 రాకెట్ లాంచర్లు, ఇజ్రాయెల్ దగ్గర 150 రాకెట్ లాంచర్లు ఉన్నాయి. కాగా, ఇరాన్ 65,765 సాయుధ వాహనాలను  కలిగి ఉంది. ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఈ సంఖ్యా 43,407మాత్రమే. 

Iran vs Israel: నౌకాదళం గురించి చూస్తే కనుక ఇరాన్ దగ్గర 101 యుద్ధ నౌకలున్నాయి. ఇజ్రాయెల్ దగ్గర 67 మాత్రమే ఉన్నాయి. జలాంతర్గాములు ఇరాన్ 19 కలిగి ఉంటె, ఇజ్రాయెల్ 5 మాత్రమే కలిగి ఉంది. ఫ్రిగేట్లు ఇరాన్  దగ్గర 7 ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గర ఏమీ లేవు. కార్వేట్లు ఇరాన్ 3 కలిగి ఉంది. ఇజ్రాయెల్ లో 7 ఉన్నాయి. ఇక ఇరాన్ చేతిలో 21 గస్తీ నౌకలున్నాయి. ఇజ్రాయెల్ లో వీటి సమాఖ్య 45. 

Iran vs Israel: యుద్ధ విమానాల విషయాన్ని పరిశీలిస్తే.. ఇరాన్ దగ్గర 551 ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గర 612 ఉన్నాయి. ఫైటర్ జెట్ లు ఇరాన్ దగ్గర 186 ఉండగా, ఇజ్రాయెల్ అధికంగా 241 ఫైటర్ జెట్లను కలిగి ఉంది. రవాణా విమానాలు ఇజ్రాయెల్ దగ్గర 40 ఉంటె, ప్రతిగా ఇరాన్ దగ్గర 7 మాత్రమే ఉన్నాయి. హెలికాఫ్టర్లు కూడా ఇజ్రాయెల్ దగ్గరే ఎక్కువ ఉన్నాయి. వీటి సమాఖ్య 146. కాగా, ఇరాన్ దగ్గర 129 హెలికాఫ్టర్లు మాత్రమే ఉన్నాయి. ఫైటర్ హెలికాఫ్టర్ల విషయంలోనూ ఇరాన్ వెనుకబడి ఉంది. ఇక్కడ 13 ఫైటర్ హెలికాఫ్టర్లు ఉంటే, ఇజ్రాయెల్ దగ్గర 48 ఉన్నాయి.            

ఇదీ సంక్షిప్తంగా ఇరాన్, ఇజ్రాయెల్ దగ్గర ఉన్న సైనిక-ఆయుధ సంపత్తి. వీటితో ఇరాన్ 8.75 కోట్ల జనాభాను రక్షించుకోవాలి. అదే ఇజ్రాయెల్ జనాభా 90 లక్షలు మాత్రమే. అంటే జనాభా పరంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్న ఇజ్రాయెల్ తనకన్నా ఎన్నో రేట్లు మెరుగైన జనాభా రేటు ఉన్న పెద్ద దేశం ఇరాన్ తో తలబడబోతోందన్న మాట.

#world-war-3 #iran-vs-israel
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe