ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్ పై(Iran and Israel War) దాడి చేసింది. సిరియాలోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఇజ్రాయెల్ ఇప్పుడు ఎదురుదాడి చేస్తే, రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందనే భయం ఉంది. ప్రస్తుత క్లిష్ట కాలంలో పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశాలను తోసిపుచ్చలేం. అలాగే.. ఈ యుద్ధం కనుక కొనసాగితే.. ఇది ప్రపంచ యుద్ధం గా మారదనీ చెప్పలేని పరిస్థితి ఉంది. సాధారణంగా స్టాక్ మార్కెట్ , బంగారం మొదలైనవి ప్రపంచ సంఘటనలకు ప్రతిస్పందిస్తాయి. ప్రపంచ దేశాల ఆర్ధిక పరిస్థితులపై యుద్ధ మేఘాలు(Iran and Israel War) కచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. ఆర్థికంగా, భారతదేశంతో సహా వివిధ దేశాలలో ప్రపంచ ఆర్థిక ప్రభావం వచ్చే ప్రమాదం ఉంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంతోనే కొంత కాలంగా ప్రపంచం అల్లాడిపోతోంది. మరి ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధానికి దగ్గరలో ఉన్న పరిస్థితి కనిపిస్తున్న తరుణంలో మన ఆర్ధిక పరిస్థితిపై ప్రభావం ఎలా ఉంటుంది? ఆ విషయాన్ని అర్ధం చేసుకుందాం.
పెట్రోలుపై ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్రభావం
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం(Iran and Israel War) గల్ఫ్ దేశాల మధ్య ఉంది. ఇరాన్ ఒక ప్రధాన పెట్రోలియం దేశం. పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైతే, ఇతర చమురు దేశాలు కూడా పాల్గొనవచ్చు. అయితే ముడి చమురు ధర బ్యారెల్‌కు 90 డాలర్లు ఉండగా, అతి త్వరలో 100 డాలర్ల మార్కును దాటే అవకాశం ఉంది. ఇదే జరిగితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగే అవకాశాలు ఉన్నాయి.
ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది
Iran and Israel War: పెట్రోల్ ధర పెరిగితే సహజంగానే రకరకాల వస్తువుల ధరలు పెరుగుతాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం పెరిగితే ఆ ప్రభావం మన లోన్స్ ఈఎంఐల పై పడుతుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరిగితే.. దానిని అదుపు చేయడానికి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతాయి. అది మన ఈఎంఐల పై ప్రభావం చూపిస్తుంది.
బంగారం ధర పెరగవచ్చు..
ప్రపంచంలో ఇలాంటి అంతరాయం(Iran and Israel War) ఏర్పడినప్పుడు చాలా మంది పెట్టుబడిదారులు మేల్కొంటారు. వారు తమ పెట్టుబడిని సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలని ప్రయత్నిస్తారు. ప్రస్తుత పరిస్థితిలో బంగారం సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తున్నారు. దీంతో బంగారానికి భారీగా డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఇప్పటికే గరిష్ఠ స్థాయిలో ఉన్న బంగారం ధర మరింత పెరిగే అవకాశాలున్నాయి.
స్టాక్ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం?
ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం(Iran and Israel War) తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్ క్షీణించింది. అయితే, ఇజ్రాయెల్ టెల్ అవీవ్ స్టాక్ మార్కెట్ పెద్దగా మార్పులకు గురికాలేదు. కానీ, అమెరికా మార్కెట్ ప్రభావంతో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు స్పందించవచ్చు. గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కుదుపునకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పటికిప్పుడు ఈ ప్రభావం మన స్టాక్ మార్కెట్ పై విపరీతంగా కనిపించకపోవచ్చు. భారత మార్కెట్‌లో వైవిధ్యానికి తక్కువ అవకాశం ఉంది.
Also Read: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం..వేడెక్కుతున్న ప్రపంచం
భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉండొచ్చు?
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం(Iran and Israel War) ప్రస్తుతానికి భారత్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. పెట్రోలు మరింత ఖరీదైనదిగా మారడంతో అది ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. ఏదేమైనా, ఆర్థిక వ్యవస్థ ప్రధాన భాగం ఆరోగ్యంగా ఉన్నందున భారత ఆర్థిక వ్యవస్థ కొంత కాలం వరకు ఈ యుద్ధ వేడిని తట్టుకోగలదు మన ఆర్ధిక వ్యవస్థ. అయితే, ఇది దీర్ఘకాలం కొనసాగితే మాత్రం భారత ఆర్ధిక వ్యవస్థ కూడా ప్రభావితం అయ్యే అవకాశాలున్నాయి.