ENGLAND: ఐపీఎల్ కు దూరంగా ఉన్న ఇంగ్లాండ్ ఆటగాళ్ల పై ప్రాంఛైజీల సీరియస్! ఐపీఎల్ సీజన్2024 కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. కాని కొందరు ఇంగ్లాడ్ ఆటగాళ్లు మాత్రం లీగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం పై కొన్ని ఐపీఎల్ ప్రాంఛైజీలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. By Durga Rao 14 Mar 2024 in స్పోర్ట్స్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి ఐపీఎల్ సీజన్2024 కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. కాని కొందరు ఇంగ్లాడ్ ఆటగాళ్లు మాత్రం లీగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం పై కొన్ని ఐపీఎల్ ప్రాంఛైజీలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024కు మరో 9 రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ర్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే టోర్నీ ప్రారంభానికి గడువు సమీపిస్తున్న సమయంలో ఇంగ్లాండ్ ఆటగాళ్ల లీగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారింది.జేసన్ రాయ్,హ్యారీ బ్రూక్,జో రూట్, గస్ అట్కిన్సన్ వంటి ప్లేయర్లు ఈ సీజన్ లో తప్పుకున్నారు.వేలంలో పేర్లు ఇచ్చిన ఆటగాళ్లు లీగ్ సమయానికి వ్యక్తిగత కారణాలు,వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ అని చెబుతూ దూరమవుతున్నారు. ఐపీఎల్లో ఆడేందుకు పేరు నమోదు చేయించుకోవడం, వేలంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టడం తీరా మ్యాచుల సమయానికి ఎగ్గొట్టడం ఆ జట్టు ప్లేయర్లకు అలవాటుగా మారిందని ఫ్రాంఛైజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. #england-players #ipl మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి