IPL Matche 2024: ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ రిలీజ్ ఎప్పుడు? ఇండియాలో మొత్తం మ్యాచ్‌లు సాధ్యమేనా? ఇవాళ్టి నుంచి ఐపీఎల్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఐపీఎల్‌కు సంబంధించి పూర్తి షెడ్యూల్ రాలేదు. పోలింగ్ తేదీలకు అడ్డురాకుండా మొదట 21 మ్యాచ్‌లకు మాత్రమే షెడ్యూల్‌ని విడుదల చేశారు. మిగతా మ్యాచ్‌ల నిర్వహణపై బీసీసీఐ కసరత్తు చేస్తోంది. By Vijaya Nimma 22 Mar 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి IPL Match 2024: ఐపీఎల్-2024 మెగా టోర్నీ ప్రారంభమవుతోంది. BCCI మాత్రం కేవలం మొదటి రెండు వారాలకు మాత్రమే IPL మ్యాచ్‌ల షెడ్యూల్‌ని ప్రకటించింది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ని ప్రకటించడంతో మ్యాచ్‌ల నిర్వహణ విషయంలో బీసీసీఐ డైలమాలోపడింది. పోలింగ్ తేదీలకు అడ్డురాకుండా మొదట 21 మ్యాచ్‌లకు మాత్రమే షెడ్యూల్‌ని విడుదల చేశారు. మిగతా మ్యాచ్‌ల నిర్వహణపై బీసీసీఐ కసరత్తు చేస్తోంది. త్వరలోనే మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. మ్యాచ్‌ల నిర్వహణపై క్లారిటీ: భారత ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో ఆయా తేదీలతో క్లాష్ కాకుండా మ్యాచ్‌లను నిర్వహిస్తున్నామని, మిగతా మ్యాచ్‌ల తేదీలపై కసరత్తులు చేస్తున్నామని ఐపీఎల్ జీసీ చైర్మన్ అరుణ్ ధుమాల్ చెబుతున్నారు. అయితే ఐపీఎల్‌ను ఇతర దేశాల్లో ఆడించే యోచనలేదని, మొత్తం లీగ్‌ను భారత్‌లోనే నిర్వహిస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రణాళిక ప్రకారమే: భారత క్రికెట్ బోర్డు ఫిబ్రవరి 22న మొదటి రెండు వారాల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆ తర్వాత పోలింగ్ తేదీలను బట్టి మిగతా మ్యాచ్‌లను ఎప్పుడు నిర్వహించాలో క్లారిటీ ఇస్తామని ఇప్పటికే చెప్పారు. అయితే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించడంతో ముందుగా కొన్ని మ్యాచ్‌లను నిర్వహించనున్నట్టు ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ని విడుదల చేశారు. ప్రారంభ కార్యక్రమం: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. మొదటి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ బెంగళూరు మధ్య ఉంటుంది. ఓపెనింగ్ సెర్మనీకి కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ప్రముఖ సెలబ్రిటీలు అంతా రానున్నారని నిర్వాహకులు అంటున్నారు. ఇది కూడా చదవండి: పెంపుడు జంతువులతో కలిసి నిద్రిస్తే ఏమవుతుంది? #ipl-match-dates #ipl-match మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి