Cheerleaders in IPL : ఐపీఎల్‎లో ఛీర్ లీడర్స్..ఒక్కో మ్యాచ్‎కు ఎంత సంపాదిస్తారో తెలుస్తే షాక్ అవుతారు.!

మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతోంది. సిక్సులు, గాల్లో ఎగిరే వికెట్లు, కళ్లు చెదిరే క్యాచులే కాదు బౌండరీ లైన్ దగ్గర అందంగా డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులను ఉత్సాహపరిచే ఛీర్ లీడర్స్ కూడా కనిపిస్తారు. ఈ అందమైన భామల రెమ్యూనరేషన్ గురించి తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లండి.

New Update
Cheerleaders in IPL : ఐపీఎల్‎లో ఛీర్ లీడర్స్..ఒక్కో మ్యాచ్‎కు ఎంత సంపాదిస్తారో తెలుస్తే షాక్ అవుతారు.!

Cheerleaders in IPL :  మార్చి 22 నుంచి ఐపీఎల్ 17 లీగ్(IPL 17 League) షురూ కాబోతోంది. శుక్రవారం మొదటి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు(Royal Challengers Bangalore) తలపడనున్నాయి. ఈ మ్యాచులో ఇరు జట్ల తరపున ఛీర్ లీడర్స్(Cheerleaders) కూడా అందమైన విన్యాసాలతో అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ అందమైన భామలకు ఐపీఎల్ లో ఎంత రెమ్యూనరేషన్ అందుతుందో మీకు తెలుసా. అయితే ఈ స్టోరీలోకి వెళ్లండి.

సాధారణంగా ప్రతి మ్యాచులో ఛీర్ లీడర్స్ కు మంచి పారితోషికం లభిస్తుందట. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. ఛీర్ లీడర్స్ ఒక్కో మ్యాచ్ కు దాదాపు రూ. 14వేల నుంచి 25వేల రూపాయల వరకు అందుకుంటారట. ఈ మొత్తం ఆయ ఫ్రాంచైజీలను బట్టి మారుతూ ఉంటుందట. అందరూ ఒకే మొత్తాన్ని ఆఫర్ చేయకపోవచ్చని కూడా తెలుస్తోంది.

ఇక చెన్నై, పంజాబ్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లు తమ ఛీర్ లీడర్స్ కు ఒక్కో మ్యాచ్ కు రూ. 12000పైగా చెల్లిస్తాయట. ముంబై ఇండియన్స్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు సమారు రూ. 20వేలు చెల్లిస్తాయట. అత్యధికంగా కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ తమ ఛీర్ లీడర్స్ కు ఒక్కో మ్యాచ్ కు రూ. 24వేల నుంచి 25వేల వరకు చెల్లిస్తుందని సమాచారం.

అయితే చాలా మంది ఛీర్ లీడర్స్ విదేశాల నుంచి వస్తారు. దీంతో వారికి పారితోషికంతోపాటు భారత్ లో ఉన్న సమయంలో విలాసవంతమైన వసతి, రోజువారీ ఆహారం, ఇతర సౌకర్యాలు కూడా లభిస్తాయట. ఈ ఖర్చులన్నీ ప్రాంచైజీలే భరిస్తాయని సమాచారం. తమ క్రికెట్ జట్టు బాగా రాణిస్తే ఈ ఆదాయంతోపాటు, ఛీర్ లీడర్స్ కు ప్రత్యేకంగా కొంత బోనస్ అమౌంట్ కూడా అందిస్తారట. టోర్నీ గెలిచిన తర్వాత కూడా కొంత డబ్బు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఇక ఛీర్ లీడర్స్ గా మారడటం అంటే అంత ఈజీ కాదు. డ్యాన్స్, మోడలింగ్, ప్రేక్షకుల ముందు ఫర్మార్మ్ చేయడంలో అనుభవం ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు. ఐపీఎల్(IPL) ఛీర్ లీడర్ రోల్ కు ఆడిషన్ చేస్తున్నప్పుడు అభ్యర్థులు ప్రిపేర్డ్ పర్మార్మేన్స్ తో రెడీగా ఉండాలి. ఆడిషన్ లో ఎంపిక అయిన తర్వాతే ఐపీఎల్ లో ప్రేక్షకులను అలరించే రోల్ లభిస్తుంది.

ఇది కూడా చదవండి :  ప్రాణపాయ స్థితిలో సద్గురు.. క్లారిటీ ఇచ్చిన ఈషా ఫౌండేషన్ !

Advertisment
తాజా కథనాలు