IPL Action 2024 Purse: ఒక్కో ఫ్రాంచైజీ వద్ద ఎంత డబ్బు ఉంది? ఎవరి పర్సు ఎక్కువగా ఖాళీగా ఉంది? ఐపీఎల్ మినీ ఆక్షన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆక్షన్‌లో టీమ్‌లకు ఉన్న పర్సులను ఒకసారి గమనిస్తే గుజరాత్ టైటాన్స్ వద్ద అత్యధికంగా 38.15 కోట్ల రూపాయలు ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ దగ్గర అందరికంటే తక్కువగా 13.15 కోట్ల రూపాయల బ్యాలెన్స్ ఉంది. By Trinath 18 Dec 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ఐపీఎల్ మినీ ఆక్షన్‌కు టైమ్ దగ్గరపడింది. రేపు(డిసెంబర్ 19)దుబాయ్ వేదికగా 77స్లాట్ల కోసం వేలం జరగనుంది. ఐపీఎల్-2024 వేలంలో 333 మంది ఆటగాళ్లు ఉండగా, గరిష్టంగా 77 స్లాట్లను 10 ఫ్రాంచైజీలు భర్తీ చేయనున్నాయి. అందులో విదేశీ ఆటగాళ్లకు 30 స్లాట్లు అందుబాటులో ఉండటంతో ఐపీఎల్లో 10 జట్లలో ఏ ఆటగాడికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఏ జట్టు దగ్గర ఎంత డబ్బులున్నాయన్నదానిపై ఓ లుక్కేయండి. గుజరాత్ టైటాన్స్ (రూ.38.15 కోట్లు) సన్ రైజర్స్ హైదరాబాద్ (రూ.34 కోట్లు) కోల్ కతా నైట్ రైడర్స్ (రూ.32.7 కోట్లు) చెన్నై సూపర్ కింగ్స్ (రూ.31.4 కోట్లు) పంజాబ్ కింగ్స్ (రూ.29.1 కోట్లు) ఢిల్లీ క్యాపిటల్స్ (రూ.28.95 కోట్లు) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రూ.23.25 కోట్లు) ముంబై ఇండియన్స్ (రూ.17.75 కోట్లు) రాజస్థాన్ రాయల్స్ (రూ.14.5 కోట్లు) లక్నో సూపర్ జెయింట్స్ (రూ.13.15 కోట్లు) ఐపీఎల్ 2024 వేలం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం కానుంది. మంగళవారం భారతదేశంలో జియో సినిమా ద్వారా ఆన్‌లైన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. భారత్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభం కానుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు(వేలానికి ముందు వరకు): అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), మార్కో జాన్సన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టీ నటరాజన్, అన్మోల్ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హక్ ఫారూఖీ, షాబాజ్ అహ్మద్. Also Read: క్రికెట్ స్టేడియంలో ఉరేసుకున్న యువకుడు.. షాక్‌లో గ్రౌండ్ సిబ్బంది! WATCH: #sunrisers-hyderabad #ipl-auction-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి