Play Off Race : ఆసక్తి కరంగా మారిన ఐపీఎల్ ప్లేఆఫ్ రేస్.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్లేఆప్ రేస్ ఆసక్తికరంగా మారింది.ఇప్పటికే ముంబై జట్టు ఎలిమినేట్ కాగా వరసుగా మూడు మ్యాచ్ లలో విజయం సాధించిన బెంగళూరు టీమ్ ప్లేఆఫ్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.అది ఎలానో ఇప్పుడు చూద్దాం. By Durga Rao 05 May 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premier League) ఈ సీజన్‌లో, ప్లేఆఫ్ కోసం పోటీపడే జట్లకు సంబంధించి ఇప్పటి స్పష్టత కనిపించటం లేదు. ఇందులో రాజస్థాన్ రాయల్స్(RR) జట్టు 16 పాయింట్లకు చేరుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR) ప్లేఆఫ్స్ ను చేరుకున్నట్టు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2024(IPL 2024) లో ఇప్పటివరకు అన్ని జట్లు 10-10 మ్యాచ్‌లు ఆడాయి. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టు 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. కోల్‌కతా 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చెరో 12 పాయింట్లు సాధించాయి. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చెరో 10 పాయింట్లతో ఉన్నాయి. దీంతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ 8 పాయింట్లు సాధించాయి. ముంబై ఇండియన్స్ ఖాతాలో కేవలం 6 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. టోర్నమెంట్‌లో పాల్గొనే 10 జట్లలో 7 జట్లు 16 పాయింట్లు లేదా అంతకంటే ఎక్కువ సాధించే అవకాశం ఉంది . ఇందులో రాజస్థాన్ ఇప్పటికే 16 పాయింట్లు సాధించింది. కోల్‌కతా, హైదరాబాద్, లక్నో మరియు చెన్నై 10 మ్యాచ్‌లు ఆడగా, మిగిలిన 4 మ్యాచ్‌లలో గెలవడం ద్వారా 16 పాయింట్లు లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లతో ముందుకు సాగవచ్చు. ఢిల్లీ, పంజాబ్ జట్లు మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే 16 పాయింట్లకు చేరుకోవచ్చు. అయితే ముంబై కేకేఆర్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలవటంతో ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ నుంచి వైదొలిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బెంగళూరు వరసుగా మూడు మ్యాచ్ లు గెలిచి ప్లేఆప్స్ అవకాశాలు తగ్గిపోలేదు.అనే సంకేతాలు పంపించింది. ఏదైనా అదృష్టం జరిగితే తప్ప బెంగళూరు ప్లేఆఫ్స్ వెళ్లే మార్గాలు కనిపించటం లేదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. కానీ కొందరు సామాజిక మాధ్యమాలలో జరిగబోయే జట్లు ఓటములు ముందుగా అంచనా వేసి ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుందని వారు చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.. #ipl-2024 #ipl-playoff #ipl-2021-playoffs #rr-v-s-kkr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి