IPL 2024 Play Off: చేతులెత్తేసిన సన్ రైజర్స్.. ప్లే ఆఫ్ లో కేకేఆర్ చేతిలో దారుణ ఓటమి

ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఘోర పరాజయం పాలైంది. దీంతో నైట్ రైడర్స్ జట్టు ఆడుతూ పాడుతూ ఫైనల్స్ చెరిపోయింది. వివరాలు ఆర్టికల్ లో చూడవచ్చు.

New Update
IPL 2024 Play Off: చేతులెత్తేసిన సన్ రైజర్స్.. ప్లే ఆఫ్ లో కేకేఆర్ చేతిలో దారుణ ఓటమి

IPL 2024 Play Off: అదుర్స్ అనుకున్నాం.. తిరుగులేదని చెప్పుకున్నాం.. చివరి లీగ్ మ్యాచ్ మెరుపులు చూసి వారెవ్వా అని పొంగిపోయాం.. ఎంటయ్యా ఇదీ.. కనీసం చిన్నపిల్లలైనా పోరాడుతారే.. మీరేందయ్యా మరీ దారుణంగా చేతులెత్తేసి కోల్ కతా కి జై కొట్టారు అంటున్నారు సన్ రైజర్స్ హైదరాబద్ అభిమానులు. టోర్నీ ప్రారంభం నుంచి హాట్ ఫేవరెట్ లా.. అందరి దృష్టినీ ఆకర్షించిన సన్ రైజర్స్.. కీలక మ్యాచ్ లో బ్యాటులు సర్దేసింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్ మ్యాచ్ లో ఏమాత్రం పోరాటం లేకుండానే.. చేతులెత్తేసింది సన్ రైజర్స్ టీమ్.

VIPL 2024 Play Off: బౌలర్ల అద్భుత ఆటతీరుతో వెంకటేష్ అయ్యర్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ల అద్భుత అర్ధ సెంచరీల ప్రదర్శనతో కోల్‌కతా నైట్ రైడర్స్ క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ రాహుల్ త్రిపాఠి 55 పరుగుల సాయంతో 19.3 ఓవర్లలో 159 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 58 పరుగులు చేయగా, వెంకటేష్ అయ్యర్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 51 పరుగులతో అజేయంగా నిలిచాడు. జట్టు 13.4 ఓవర్లలో విజయం సాధించింది.

Advertisment
తాజా కథనాలు