IPL 2024: IPL 2024 పూర్తి షెడ్యూల్ రిలీజ్ అయింది. మార్చి 22న మొదలైన మెగా టోర్నమెంట్ జోరుగా నడుస్తుండగా ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను విడుదల చేశారు నిర్వాహకులు. మే 26న జరిగే ఫైనల్‌కు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది. 21న అహ్మదాబాద్‌లో తొలి క్వాలిఫయర్, 22న ఎలిమినేటర్ పోరు అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి.
ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు..
తొలి క్వాలిఫయర్: మే 21.. వేదిక అహ్మదాబాద్.
ఎలిమినేటర్ మ్యాచ్: మే 22.. వేదిక అహ్మదాబాద్.
రెండో క్వాలిఫయర్ : మే 24.. వేదిక చెన్నై.
ఫైనల్ : మే 26న.. వేదిక చెన్నై.
12 సంవత్సరాల తర్వాత..
ఇక 12 సంవత్సరాల తర్వాత చెన్నై చెపాక్ స్టేడియం మొదటిసారి IPL ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. చెపాక్ స్టేడియం వేదికగా మే 26న టైటిల్ పోరు జరగనుంది. ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ గతంలో 2011, 2012లో రెండు ఐపీఎల్ ఫైనల్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది. అలాగే మే 24న రెండో క్వాలిఫయర్‌కు సైతం చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది. మొదటి క్వాలిఫయర్ మే 21న, ఎలిమినేటర్ మే 22న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.
ప్లేఆఫ్‌లతో సహా 52 మ్యాచ్‌లతో కూడిన IPL షెడ్యూల్ రెండవ భాగం ఏప్రిల్ 8న ప్రారంభమవుతుంది. మే 19న రాజస్థాన్ రాయల్స్, KKR మధ్య ఈ సీజన్‌లోని చివరి లీగ్ గేమ్‌కు గౌహతి ఆతిథ్యం ఇవ్వనుంది.