IPL 2024 Award Winners: కోల్‌కతాకు ఐపీఎల్ ట్రోఫీ.. ఆరెంజ్ క్యాప్.. పర్పుల్ క్యాప్ ఇతర అవార్డుల పూర్తి లిస్ట్ ఇదే!

ఐపీఎల్ 2024 ఫైనల్స్ లో కోల్‌కతా ట్రోఫీ గెలిచింది. ఫైనల్స్ తరువాత ఈ సీజన్ లో అత్యధిక ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు అవార్డులు ఇచ్చారు. ఆరెంజ్ క్యాప్ విరాట్ కోహ్లీ, పర్పుల్ క్యాప్ హర్షల్ పటేల్ గెలుచుకున్నారు.. మిగిలిన అవార్డుల వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.. 

New Update
IPL 2024 Award Winners: కోల్‌కతాకు ఐపీఎల్ ట్రోఫీ.. ఆరెంజ్ క్యాప్.. పర్పుల్ క్యాప్ ఇతర అవార్డుల పూర్తి లిస్ట్ ఇదే!

IPL 2024 Award Winners: కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను గెలుచుకోవడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024 ఆదివారం ముగిసింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఫైనల్లో పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)పై శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కెకెఆర్ విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

IPL 2024 Award Winners: హాట్ ఫేవరేట్ గా భావించిన SRH చివరి మెట్టుపై బోల్తా కొట్టింది. హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ సీజన్ మొదటి అర్ధభాగంలో అద్భుతమైన బ్యాటింగ్ తో అలరించారు. కానీ, ఆదివారం మ్యాచ్ లో చేతులెత్తేశారు. దీంతో SRH 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది.  కమ్మిన్స్ చేసిన 24 పరుగులే టాప్ స్కోర్ అంటే హైదరాబాద్ బ్యాటర్ల తీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వీరి ఆటతీరుతో మ్యాచ్ ఏకపక్షంగా మారిపోయింది. 

IPL 2024 Award Winners: హైదరాబాద్ ఇచ్చిన 114 పరుగుల లక్ష్యాన్ని వెంకటేష్ అయ్యర్ (52*), రహ్మానుల్లా గుర్బాజ్ (39) ఆడుతూ పాడుతూ చేధించేశారు. సగం ఓవర్లు మిగిలి ఉండగానే KKRని విజేతగా నిలిపారు. పదేళ్ల తరువాత కోల్‌కతాకు ఐపీఎల్ ట్రోఫీని అందించారు. 

Also Read: చేతులెత్తేసిన హైదరాబాద్.. కప్ ఎగరేసుకుపోయిన కోల్ కతా

మ్యాచ్ అనంతర ప్రెజెంటేషన్ వేడుకలో అనేక వ్యక్తిగత - జట్టు అవార్డులు అందచేశారు.  KKR IPL విన్నర్స్ ట్రోఫీని అందుకోగా SRH రన్నర్స్-అప్ చెక్, పతకాలను అందుకుంది.

RCB నుంచి విరాట్ కోహ్లీ (741 పరుగులు) ఆరెంజ్ క్యాప్ గెలుచుకోగా, PBKS పేసర్ హర్షల్ పటేల్ (24 వికెట్లు) పర్పుల్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో రెండు అర్ధసెంచరీలతో సహా 303 పరుగులు చేసిన 21 ఏళ్ల నితీష్ కుమార్ రెడ్డి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచాడు.

ఐపీఎల్ 2024లో మంచి ప్రతిభ కనబరిచినందుకు ఇచ్చిన అవార్డుల(IPL 2024 Award Winners) వివరాలు ఇవే.. 

విజేతలు: కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ. 20 కోట్లు)

రన్నరప్: సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 12.5 కోట్లు)

ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: నితీష్ కుమార్ రెడ్డి (రూ. 10 లక్షలు)

ఆరెంజ్ క్యాప్: విరాట్ కోహ్లీ (రూ. 10 లక్షలు)

పర్పుల్ క్యాప్: హర్షల్ పటేల్ (రూ. 10 లక్షలు)

సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ (రూ. 10 లక్షలు)

అల్టిమేట్ ఫాంటసీ ప్లేయర్ : సునీల్ నరైన్ (రూ. 10 లక్షలు)

మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్: సునీల్ నరైన్ (రూ. 10 లక్షలు)

సీజన్‌లో అత్యధిక సిక్సర్లు: అభిషేక్ శర్మ (రూ. 10 లక్షలు)

సీజన్‌లో అత్యధిక ఫోర్లు: ట్రావిస్ హెడ్ (రూ. 10 లక్షలు)

క్యాచ్ ఆఫ్ ద సీజన్: రమణదీప్ సింగ్ (రూ. 10 లక్షలు)

బెస్ట్ పిచ్ - సీజన్ గ్రౌండ్: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ (రూ. 50 లక్షలు)

ఫెయిర్‌ప్లే అవార్డు: సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 10 లక్షలు)

ఇక ఫైనల్ మ్యాచ్ కి సంబంధించిన అవార్డులు ఇవే.. 

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మిచెల్ స్టార్క్ (రూ. 5 లక్షలు)

అల్టిమేట్ ఫాంటసీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మిచెల్ స్టార్క్ (రూ. 1 లక్ష)

ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్: వెంకటేష్ అయ్యర్ (రూ. 1 లక్ష)

గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది మ్యాచ్: హర్షిత్ రాణా (రూ. 1 లక్ష)

మ్యాచ్‌లో అత్యధిక ఫోర్లు: రహ్మానుల్లా గుర్బాజ్ (రూ. లక్ష)

మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు : వెంకటేష్ అయ్యర్ (రూ. 1 లక్ష)

Advertisment
Advertisment
తాజా కథనాలు