T20 world cup: టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నీలో భారత్ వరుస విజయాలపై పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ సంచలన ఆరోపణలు చేశాడు. టీమ్ ఇండియా బౌలర్లు బంతితో ఏదో చేస్తున్నారని, రివర్స్ స్వింగ్ డెలివరీలను ఫర్ఫెక్ట్ గా సంధించేందుకు అర్ష్‌దీప్ సింగ్ వంటి బౌలర్లు బాల్ ట్యాంపరింగ్ కు పాల్పుడుతున్నారంటూ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు ఇలాంటి వాదనలు చేయడం విశేషం. కాగా ఇంజమామ్ కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.
రివర్స్ స్వింగ్ ఎలా రాబట్టాడు? అదెలా సాధ్యం?
ఈ మేరకు ఇంజమామ్ మాట్లాడుతూ.. ‘అర్ష్‌దీప్ సింగ్ 15వ ఓవర్ బౌలింగ్ చేసినప్పుడు బంతి రివర్స్ అవుతోంది. సాధారణంగా బంతి పాతబడ్డాక రివర్స్ స్వింగ్ అవుతుంది కానీ.. కొత్త బంతితో అర్ష్‌దీప్ రివర్స్ స్వింగ్ ఎలా రాబట్టాడు? అదెలా సాధ్యం? ఇలాంటి విషయాలను అంపైర్లు కళ్లుతెరిచి బాగా గమనించాలి. ఒకవేళ పాకిస్తానీ బౌలర్లు రివర్స్ స్వింగ్ చేసి ఉంటే.. అది పెద్ద వివాదాస్పదమయ్యేది. రివర్స్ స్వింగ్ గురించి మాకు బాగా తెలుసు. 15వ ఓవర్‌లో అర్ష్‌దీప్ బంతిని రివర్స్ స్వింగ్ చేయగలిగాడంటే.. అంతకుముందే ఏదో జరిగే ఉంటుందని అర్థం’ అంటూ అనుమానం వ్యక్తం చేశాడు.
భారత జట్టుపై పాకిస్తానీయులు నిరాధార ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2023 వన్డే వరల్డ్‌కప్ సమయంలో మహమ్మద్ షమీ బౌలింగ్ అధ్బుత ప్రదర్శనపై విషం చిమ్మారు. టీమిండియా బంతిలో కొన్ని చిప్‌లను ఉపయోగించిందని పాక్ మాజీ ఆటగాడు హసన్ ఆరోపించాడు. అయితే ప్రస్తుతం ఇంజమామ్ ఆరోపణలపై భారత ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆడటం చేతకాకపోతే మూసుకోండి. కానీ తప్పుడు ఆరోపణలు చేయొద్దంటూ మండిపడుతున్నారు.