Chandrababu: అలుపెరగని ధీరుడు..చంద్రబాబు బర్త్ డే స్పెషల్

చంద్రబాబును ఎన్టీఆర్‌ ఎలా పడేశారో తెలుసా? ఇదేంటి చంద్రబాబును ఎన్టీఆర్‌ను పడేయడమేంటని ఆలోచిస్తున్నారా? రాజకీయంగా కాదండోయ్.. దీనికి వేరే మేటరుంది. తన కూతురి పెళ్లి చూపులకు చంద్రబాబు వెళ్లిన సమయంలో ఆసక్తికర విషయాలు జరిగాయి. అవేంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.

New Update
Chandrababu: అలుపెరగని ధీరుడు..చంద్రబాబు బర్త్ డే స్పెషల్

Nara Chandrababu Birthday :  చంద్రబాబును ఎన్టీఆర్‌ ఎలా పడేశారో తెలుసా? ఇదేంటి చంద్రబాబును ఎన్టీఆర్‌ను పడేయడమేంటని ఆలోచిస్తున్నారా? రాజకీయంగా కాదండోయ్.. దీనికి వేరే మేటరుంది. తన కూతురి పెళ్లి చూపులకు చంద్రబాబు వెళ్లిన సమయంలో ఏం జరిగిందో తెలుసా? అటు పొలిటికల్‌ లైఫ్‌లో చంద్రబాబు గురించి చాలా మంది పెద్దగా చర్చించుకోని ఇంట్రెస్టింగ్‌ విషయాలు కూడా ఉన్నాయి. వీటన్నిటి గురించి ఇవాళ మనం తెలుసుకుందాం!

తెలుగుదేశం పార్టీ అధినేతగా దేశ రాజకీయాల్లో చంద్రబాబునాయుడు పోషించిన పాత్ర దేశ చరిత్రలో ముఖ్య అధ్యాయంగా చెప్పవచ్చు. రెండు కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో, ముగ్గురు ప్రధానుల ఎంపికలో, ఇద్దరు రాష్ట్రపతుల ఎంపికలో చంద్రబాబు పాత్ర అత్యంత కీలకంగా నిలిచింది. నిజానికి తనకు ప్రధాని పదవీ ఆఫర్ అనేకసార్లు వచ్చిందని.. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ అత్యున్నత పదవీని వదులుకున్నానని చంద్రబాబు అనేకసార్లు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అటు చంద్రబాబు పెళ్లి జీవితం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అది 1980.. చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్న రోజులవి. ముందుగా ఎన్టీఆర్‌ సైడ్‌ నుంచి చంద్రబాబుకు ప్రతిపాదన వచ్చిందట. పెళ్లి చూపులకు వెళ్లగానే పెద్ద పూలమాల తీసుకొచ్చి తన మెడలో వేశారని.. అప్పుడు చాలా ఇబ్బందిపడ్డానని చంద్రబాబు చెబుతుంటారు. చంద్రబాబుకు పెళ్లికి చిత్తూరు జిల్లాలో ప్రతీ ఇంటికి శుభలేఖ వెళ్లింది. ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పెళ్లికి వచ్చారు.

publive-image

1950లో ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లా, నారావారి పల్లెలో శ్రీ ఖర్జూర నాయుడు, శ్రీమతి అమ్మణ్ణమ్మ దంపతులకు చంద్రబాబు నాయుడు జన్మించారు. పొరుగు గ్రామమైన శేషాపురంలో ప్రాథమిక విద్యాభ్యాసం. చంద్రగిరిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. 1972లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి బి.ఏలో ఉత్తీర్ణత సాధించిన చంద్రబాబు.. 1974లో ఆర్థిక శాస్త్రంలో ఎమ్.ఏ. ఎకనామిక్స్ పూర్తి చేశారు.

1977లో పులిచెర్ల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా.. 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రబాబు. 1980లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ, పురావస్తు శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు 1984 మే 27న తన మావయ్య ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి చంద్రబాబు టీడీపీలో తనదైన మార్క్‌ చూపించారు. ఎన్టీఆర్‌కు అన్నివిధాల అండగా నిలిచారు. ఎన్టీఆర్‌ అసెంబ్లీలో లేని సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహించారు. ఇలా టీడీపీలో క్రమంగా చంద్రబాబు టాప్‌ పొజిషన్‌కు చేరుకున్నారు. రెండు సార్లు ఉమ్మడి ఏపీ సీఎంగా.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి తొలి సీఎంగా చంద్రబాబు సేవలందించారు.

ఓవైపు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తునే.. మరోవైపు దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు చంద్రబాబు. 1996లో కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్‌, బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్‌ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు చంద్రబాబు. 1996 జూన్ 1న హెచ్ డి దేవెగౌడను ప్రధాని చేయడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించారాయన. దేశానికి తొలి దళిత రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ ఎంపికలో చంద్రబాబు ముఖ్యపాత్ర పోషించారని టీడీపీ వర్గాలు చెబుతుంటాయి. 1998 మార్చి 19న చంద్రబాబు జాతీయ కన్వీనర్‌గా ఎన్డీఏ ఏర్పాటైంది.1998 నవంబర్ 22న ప్రధాని వాజపేయి చేతుల మీదుగా హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ప్రారంభోత్సవం జరిగింది. ఇది హైదరాబాద్‌ సిటీ రూపురేఖలను మార్చేసిందని ఆయన మద్దతుదారులు అభిప్రాయపడుతుంటారు.

40ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎంతో హూందాగా వ్యవహరించారు. ఆయనకు రాజకీయ ప్రత్యర్థులే కానీ వ్యక్తిగత ప్రత్యర్థులు లేరు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌తో చంద్రబాబు స్నేహమే అందుకు ఉదాహరణ. దాదాపు 3 దశాబ్దాలు పాటు రాజకీయ ప్రత్యర్థులగా ఉన్నా.. వారి ప్రెండ్షిప్ మాత్రం కొనసాగింది. నాడు అసెంబ్లీలో ఇద్దరి మధ్య సెటైర్లు మాత్రమే కనిపించేవి కానీ వ్యక్తిగత దూషణ అన్నదే కనిపించేది కాదు. ఇలా తన రాజకీయ ప్రత్యర్థులతోనూ చంద్రబాబు ఎంతో హూందాగా మెలిగేవారు.

Also Read: Fenugreek Water: రోజు ఉదయం మెంతి నీటిని తాగితే.. ఆ సమస్యలు పోయినట్లే..!

Advertisment
తాజా కథనాలు